- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indian Army: యుద్ధం చేస్తూ తెలియకుండానే లాహోర్ వరకూ దూసుకెళ్లిన భారత సైన్యం...చేతులెత్తేసిన పాకిస్థాన్ ఎప్పుడంటే..?
Indian Army: భారత్ పాకిస్తాన్ మొత్తం నాలుగు సార్లు యుద్ధం చేయగా అన్నిసార్లు భారత్ పై చేయి సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: Indian Army: భారత్ పాకిస్తాన్ మొత్తం నాలుగు సార్లు యుద్ధం చేయగా అన్నిసార్లు భారత్ పై చేయి సాధించింది. పాకిస్తాన్ నాలుగుసార్లు ఓటమిపాలైంది. భారత్ పాకిస్తాన్ 1947, 1965, 1971, 1999 లో యుద్ధం చేయగా భారత్ ప్రతిసారి విజయం సాధించింది. 1971 లో జరిగిన యుద్ధంలో అయితే పాకిస్తాన్ ఏకంగా రెండు ముక్కలు అయింది.
అంతే కాదు 95,000 మంది పాకిస్తాన్ సైన్యం భారత్ కు సరెండర్ అయింది. ఇలా ప్రతిసారి పాకిస్తాన్ ఓటమినే చవిచూసింది తప్ప ఎప్పుడూ కూడా విజయం అనేది దక్కలేదు. ఈ దెబ్బతో పాకిస్తాన్ ఇక భారతదేశంతో తలపడటం అసాధ్యమని నిర్ధారించుకొని ఉగ్రవాదాన్ని నమ్ముకుంది. అప్పటినుంచి భారత్ అంతర్గత భద్రతకు తూట్లు పొడిచేలా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ భారత్ పంపిస్తోంది.
భారతదేశంలో దాడులు అదేవిధంగా దేశ సమగ్రతను దెబ్బ కొట్టేలా ప్రయత్నాలు చేస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో 1965 లో జరిగిన యుద్ధం అత్యంత ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ యుద్ధంలో భారత సైన్యాలు తమ పోరాట పటిమను ఎంతలా ప్రదర్శించాయి అంటే యుద్ధం చేస్తూ ముందుకు వెళుతున్న క్రమంలో వాళ్లు పాకిస్తాన్ బోర్డర్ దాటిపోయి లాహోర్ సమీపం వరకు వెళ్లిపోయారు.
చీకటి సమయం కావడంతో వారికి అది పాకిస్తాన్ భూభాగం అని అర్థం కాలేదు. చివరకు తెల్లవారుగానే చూడంగానే అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు కనిపించాయి. అప్పుడు అది పాకిస్తాన్ భూభాగమని నిర్ధారించుకున్నారు. దీన్నిబట్టి పాకిస్తాన్ సైన్యం తమ భూభాగాన్ని విడిచిపెట్టి పరాయణం చిత్తగించి ఆ ప్రాంత ప్రజలను వదిలేసి పారిపోయాయి అని అర్థం.
అప్పటి యుద్ధంలో పాల్గొన్న సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం .. భారత సైన్యం లాహోర్ దిశగా దూసుకు ఇండియన్ ఆర్మీకి చెందిన మూడవ దళాల (III Corps) ఆధ్వర్యంలో భారత దళాలు లాహోర్‌కు 11-14 కిలోమీటర్ల దూరంలోని ఇచ్చోగిల్ కెనాల్ (Ichhogil Canal) వద్దకు చేరుకున్నాయని అధికారికంగా పేర్కొన్నాయి. అయితే, అంతర్జాతీయ ఒప్పందాల నేపథ్యంలో భారత సైన్యం లాహోర్ నగరంలోకి ప్రవేశించలేదు. ఈ యుద్ధంలో పాకిస్తాన్ కు చెందిన బర్బకి చౌకి, కాసుర్, బర్కి వంటి ప్రాంతాలను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.






