- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bunyan - Al - Marsus: పాకిస్థాన్ ప్రారంభించిన ఆపరేషన్ బున్యాన్ - అల్ - మర్సూస్ అర్థం ఏంటి..? దీని లక్ష్యం ఏంటి..?
Bunyan - Al - Marsus: పాకిస్తాన్ సైన్యం ఇటీవల భారత్ పై తాము సాగిస్తున్న యుద్ధానికి బున్యాన్ - అల్ - మర్సూస్ అని పేరు పెట్టుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Bunyan - Al - Marsus: పాకిస్తాన్ సైన్యం ఇటీవల భారత్ పై తాము సాగిస్తున్న యుద్ధానికి బున్యాన్ - అల్ - మర్సూస్ అని పేరు పెట్టుకున్నాయి. అసలు దీని అర్థం గట్టిగా కట్టబడ్డ గోడ, లేదా ఒక్కటిగా ఉండే బలమైన నిర్మాణం అనే భావన. ఈ పదాన్ని ఖురాన్‌లోని సూరా అస్సఫ్ఫ్ (61:4) నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని అర్థం పోరాడే వారు గట్టిగా కట్టి ఉన్న గోడలాగే ఉండాలి అని ఉంది. ఇక ఖురాన్ దివ్య వాణిలో దీని పూర్తి అర్థం ఇలా ఉంది.
"అల్లాహ్ తన మార్గంలో గట్టిగా ఒక్కటై పోరాడే వారిని ప్రేమిస్తాడు. వారు ఒకే నిర్మాణంలా గట్టిగా నిలబడతారు." అని అర్థం ఉంది. పాకిస్తాన్ ప్రారంభించిన ఈ పోరాటాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా తప్పు పట్టారు. పవిత్ర ఖురాన్ లో ఉన్నటువంటి బున్యాన్ - అల్ - మర్సూస్ అనే పదానికి పాకిస్తాన్ వక్ర భాష్యం చెబుతోందని ఆయన దుయ్యబట్టారు.
పవిత్ర ఖురాన్ లో నిసహాయులపైనా, సామాన్య ప్రజల పైన దాడి చేయమని ఎక్కడైనా చెప్పి ఉందా అని నిలదీశారు. మరోవైపు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు మానవాళికే పెద్ద మచ్చ తెచ్చేలా ఉన్నాయని, అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఇప్పటికే కాల్పులు విరమణ ఒప్పందాన్ని సైతం ఉల్లంఘించి భారత్ పైన దాడి చేస్తోంది దీనిని భారత సైన్యం కూడా ధైర్యంగా తిప్పికొడుతోంది.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలపై అటు అంతర్జాతీయంగా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాల్పుల విరమణ ఒపందాన్ని ఉల్లంఘించడంపై అమెరికా కూడా కాస్త గుర్రగా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి అమెరికా ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ ఉల్లంఘనలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.






