Operation Sindoor : మేమే గెలిచాం : పాక్ ప్రధాని

by Muthe.Rajitha |   (  Updated:2025-05-10 20:42:10  IST  )

గత 3 రోజులుగా జరిగిన భారత్ పాక్ యుద్ధానికి(India Pakistan War) శనివారం సాయంత్రం కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందంతో ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే.

Operation Sindoor : మేమే గెలిచాం : పాక్ ప్రధాని
X

దిశ, వెబ్ డెస్క్ : గత 3 రోజులుగా జరిగిన భారత్ పాక్ యుద్ధానికి(India Pakistan War) శనివారం సాయంత్రం కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందంతో ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Pak PM Shehbaz Sharif)స్పందించారు. శనివారం రాత్రి జరిపిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ...భారత్ తో యుద్ధంలో తాము విజయం సాధించినట్టు పేర్కొన్నారు. మా దేశాన్ని, మా పౌరులను రక్షించుకోవడానికి తాము ఏది చేయడాకైనా వెనుదిరిగేది లేదు అన్నారు. పాక్ ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు.

భారత్ తమ దేశంలోని మసీదులు, సామాన్య పౌరులపై డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులు చేసిందని.. అనేకమంది సాధారణ పౌరుల చావుకు భారత్ కారణం అని మండిపడ్డారు. తమదేశంపై నిరాధార ఆరోపణలు కూడా చేస్తుందని... భారత్ కు తగిన బుద్ధి చెప్పామని.. తమ జోలికి వస్తె తాము ఏం చేయగలమో చూపించామని... భారత్ పై యుద్ధంలో పాక్ విజయం సాధించిందన్నారు.

అయితే ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని 3 గంటలైనా గడవకముందే మరోసారి డ్రోన్లు, కాల్పులతో విరుచుకుపడి పాక్ తన వక్ర బుద్ధిని బయట పెట్టుకుంది. జమ్ము కశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు దిగింది. సరిహద్దు రాష్ట్రాల్లో దాడులు జరుగుతుండటంతో బ్లాక్ ఔట్ విధించారు.

China : మా సపోర్ట్ పాకిస్తాన్ కే

Next Story