- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
China : మా సపోర్ట్ పాకిస్తాన్ కే : చైనా
చైనా(China) తన వంకర బుద్ధిని మరోసారి ప్రకటించుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : చైనా(China) తన వంకర బుద్ధిని మరోసారి ప్రకటించుకుంది. భారత్ పాకిస్తాన్(India Pakistan War) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నవేళ తాము పాకిస్తాన్ వైపే ఉంటామని కీలక ప్రకటన చేసింది. భారత్ పాక్ మధ్య మూడు రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ఈరోజు కాల్పుల విరమణ(Ceasefire) తో ఫుల్ స్టాప్ పడింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది.
ఈ సంభాషణలో పాక్ కు చైనా అన్నివేళలా వ్యూహాత్మక సహకారం అందిస్తుందని, తమ మధ్య ఉన్నది విడదీయరాని స్నేహమని పేర్కొన్నట్టు తెలుస్తోంది. యుద్ధంలో పాకిస్తాన్ సంయమనంతో ఉందని, బాధ్యతగా వ్యవహరించిందని మాట్లాడినట్టు సమాచారం. సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడటంలో తాము పాకిస్తాన్ కు అండగా ఉంటామని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడిపై తీవ్రవాదం హేయమని ప్రకటించి ముసలి కన్నీరు కార్చింది. ఇప్పుడు పాకిస్తాన్ కు సపోర్ట్ ను తెలిపి తన అసలు రంగును బయట పెట్టుకుంది చైనా. కాగా పాకిస్తాన్ మిత్ర దేశాల్లో చైనా కూడా ఒకటి.






