- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation sindoor: ఆపరేషన్ సిందూర్ పై దేశవ్యాప్తంగా సంబురాలు
పహల్గామ్ దాడికి సమాధానం చెబుతూ భారత్ ఉగ్రమూకలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో మంగళవారం అర్ధరాత్రి

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ దాడికి సమాధానం చెబుతూ భారత్ ఉగ్రమూకలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరవాత పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలు మరియు పీఓవోకేలో మిస్సైల్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు వందమంది మరణించినట్టు తెలుస్తోంది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్ కు, ఉగ్రవాదుల బుద్ధి చెప్పేలా దాడులు చేస్తున్నందుకు యావత్ దేశం మొత్తం సంబురాలు జరుపుకుంటున్నారు.
రాజస్థాన్‌లో స్థానికులు పటాసులు పేలుస్తూ భారత్ మాతాకీ జై అంటూ సంబురాలు చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోనూ చాలా మంది ప్రజలు రోడ్లమీదకు వచ్చి జైహింద్, జై భారత్ అంటూ నినాదాలు చేశారు. నాగ్‌పూర్, పూణే, ముంబాయిలోనూ ప్రజలు జాతీయ జెండాలు పట్టుకుని జైహింద్ నినాదాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. ఇదిలా ఉంటే ఇండియా పాక్ బార్డర్‌లో కాల్పల మోత కొనసాగుతోంది. మెరుపు దాడులపై ఇండియన్ ఆర్మీ ఉదయం 10:30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది.
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్..! హైదరాబాద్‌పై పాక్ మిస్సైల్ ఎటాక్ చేస్తుందా






