- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Disha Special: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్..! హైదరాబాద్‌పై పాక్ మిస్సైల్ ఎటాక్ చేస్తుందా?
ఇండియా, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

ఇండియా, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ ప్రకటించిన నేపథ్యంలో అసలు యుద్ధం వస్తే ఏం జరుగుతుంది.. పాకిస్తాన్ మిస్సైల్ ప్రయోగిస్తే హైదరాబాద్‌కు ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నది. ఆ దేశం మిస్సైల్ రేంజ్ హైదరాబాద్ సహా ఏ నగరాల వరకు ఉన్నది. ఈ మిస్సైళ్లను అడ్డుకునే స్థాయిలో మన రక్షణ వ్యవస్థలు ఉన్నాయా? మన దేశ రక్షణ వ్యవస్థలోని ఆయుధాలు, పాక్ బలాబలాలపై సామాన్యుల్లో తీవ్ర చర్చజరుగుతున్నది. ఇప్పటికే పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిన నేపథ్యంలో పదాతి దళాలతో యుద్ధం చేసే స్థితిలో ఆ దేశం లేదు. ఒకవేళ భారత్ ఏ మాత్రం ముందడుగు వేసినా.. తను మిసైల్ దాడి చేయడం మినహా మరే చర్య చేపట్టలేదు. అయితే, పాక్ వద్ద భారత్ మొత్తం కవర్ అయ్యే స్థాయిలో పాక్ వద్ద మిసైల్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైన అస్త్రాలు షాహీన్, బాబర్. మరి ఈ మిసైళ్లను భారత్ అడ్డుకోలేదా? అంటే అది చిటికెలో పని చెప్పవచ్చు. పాక్ భూభాగం ఎక్కడినుంచైనా మిసైల్ యాక్టివేట్ కాగానే మన రక్షణ వ్యవస్థలు అలెర్ట్ అవుతాయి. ఇది వినడానికి అతిశయోక్తిలా ఉన్నా.. నూటికి నూరుపాళ్లు వాస్తవం. అందువల్ల టీవీల్లో చూపెడుతున్నట్టు పాక్ భారీగా మిసైల్ పరీక్షలు చేస్తున్నా.. అవన్నీ హనుమంతుడి ముందు కుప్పిగంతులుగా చెప్పవచ్చు. కానీ, కొన్ని మిసైళ్లను మన రక్షణ వ్యవస్థలకు పరీక్ష పెట్టే స్థాయిలో ఉన్నా.. మన రక్షణ వ్యవస్థలు అడ్వాన్డ్ సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండటం కలిసివచ్చే అవకాశం. ఇప్పుడు, పాక్ మధ్య మిసైల్ ఏయే మిసైళ్లు ఉన్నాయి.. వాటిని అడ్డుకోవడానికి భారత్ ఎలాంటి మిసైళ్లతో డిఫెన్స్ చేస్తుందో తెలుసుకుందాం. - ఎస్పీ హరీశ్
పాకిస్తాన్ వద్ద బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు ప్రధాన ఆయుధాలు. అందులో షాహీన్ సిరీస్ మిసైళ్లు ముఖ్యమైనవి. అబాబీల్, బాబర్, ఫతా, గౌరీ కూడా ఉన్నాయి. ఈ మిసైళ్లన్నింటినీ వెహికల్ ల్యాంచ్ ప్యాడ్‌లతో ప్రయోగించవచ్చు. అందువల్ల అవి ఎక్కడ నుంచి లాంచ్ అవుతాయన్నది ప్రశ్నార్థకం. కానీ, ఒకసారి మిసైల్ ఆన్ చేసి, డైరెక్షన్ సెట్ చేయగానే మన రక్షణ వ్యవస్థలు పసిగడతాయి. అందువల్ల అంతర్జాతీయ మీడియాలో పాక్ సైనిక బలంపై జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తదే. ఎందుకంటే మన సైనిక బలగాలతో పోల్చితే పాక్ చాలా బలహీనంగా ఉన్నది. ఈ వాదన ఎలా ఉన్నా.. పాక్ వద్ద నున్న క్షిపణులు వాటి రేంజ్ ఏమిటో చూద్దాం.
పాక్ క్షిపణులు వాటి రేంజ్ ఇలా..
షాహీన్-III: 2,750 కి.మీ.
షాహీన్-II: 2,000 కి.మీ.
అబాబీల్: 2,200 కి.మీ.
బాబర్ (హత్ఫ్ VII): 700 కి.మీ.
రాద్ (హత్ఫ్ VIII): 350 కి.మీ.
ఫతాహ్-II: 400 కి.మీ.
గౌరీ (హత్ఫ్ V): 1,500 కి.మీ.
ఈ మూడు డేంజర్..
అబాబీల్: ఈ క్షిపణి మల్టీపుల్ ఇండిపెండెంట్ రీ-ఎంట్రీ వెహికల్ (MIRV) సామర్థ్యం కలిగి ఉంది. అంటే ఒకేసారి వేర్వేరు ప్రాంతాలపై దాడి చేసే అవకాశం ఉంటుంది. భారతదేశ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (BMD) వ్యవస్థలను దాటిపోయే సామర్థ్యం కలిగి ఉంది.
బాబర్ (హత్ఫ్ VII): రేంజ్ 700 కి.మీ. ఈ క్రూయిజ్ క్షిపణి భూమి, వాయు, సముద్రం నుండి ప్రయోగించబడుతుంది. ఇది తక్కువ ఎత్తులో ఎగురుతూ రాడార్‌లను తప్పించగలదు, ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లను లక్ష్యంగా చేసుకోగలదు.
ఫతాహ్-II: రేంజ్ 400 కి.మీ. ఈ షార్ట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి (SRBM) 2023లో పరీక్షించబడింది. S-400 వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలను దాటి దాటి దాడులు చేసేలా రూపొందించబడింది. ఇది పంజాబ్, రాజస్థాన్, మరియు గుజరాత్‌లోని సైనిక స్థావరాలు, వంతెనలతోపాటు ఢిల్లీలోని కమాండ్ సెంటర్‌లను లక్ష్యంగా చేయగలదు.
మిసైళ్ల రేంజ్‌లో ఉన్న నగరాలు
పాకిస్తాన్ క్షిపణుల రేంజ్ ఆధారంగా, భారతదేశంలో ఈ క్రింది ప్రాంతాలు లక్ష్యంగా చేయబడే అవకాశం ఉంది. ఇందులో హైదరాబాద్ సహా పలు దక్షిణాది నగరాలు కూడా ఉన్నాయి. నిజానికి ఏ మిసైల్ అయినా అందులో అణుబాంబు కాకుండా సాంప్రదాయ పేలుడు పదార్థాలను అమర్చినా దాని వల్ల దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో తీవ్ర నష్టం జరుగుతుంది. కిలోమీటర్ పరిధిలో మంటలు చెలరేగడం లేదా భవనాలు పూర్తిగా నేలమట్టం కావడం జరుగుతుంది.
ఉత్తర భారతదేశం: జమ్మూ కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీలను ఫతాహ్-II, బాబర్, రాద్ క్షిపణులు టార్గెట్ చేయగలవు.
పశ్చిమ భారతదేశం: షాహీన్-II, అబాబీల్ క్షిపణుల రేంజ్‌లో జైపూర్, అహ్మదాబాద్, ఇండోర్, భోపాల్ వంటి నగరాలు ఉంటాయి.
మధ్య, దక్షిణ భారతదేశం: షాహీన్-III యొక్క 2,750 కి.మీ రేంజ్ ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలను కూడా లక్ష్యంగా చేయగలదు.
తూర్పు, ఈశాన్య భారతదేశం: కోల్‌కతా, గౌహతితోపాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు షాహీన్-III రేంజ్‌లోకి వస్తాయి.
అండమాన్ నికోబార్ దీవులు: షాహీన్-III ఈ దీవులలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేయగలదు. అయితే దూరం కారణంగా ఈ లక్ష్యం సవాలుగా ఉంటుంది.
మన రక్షణ వ్యవస్థలు.. వాటి సామర్థ్యం
భారతదేశం వద్ద బహుళ-స్థాయిల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అబాబీల్, బాబర్, ఫతాహ్ వంటి క్షిపణులు కొంత ప్రమాదకరమే అయినా, వాటినుంచి దేశాన్ని రక్షించుకునేందుకు మనకు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇందులో S-400, బరాక్-8, ఆకాశ్, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) వంటివి ప్రధానమైన వ్యవస్థలు. ఇవి పాకిస్తాన్ క్షిపణులను అడ్డుకోగల పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి.
S-400 ట్రంఫ్:
ఇది రష్యా తయారు చేసిన అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ. దాదాపు ఇజ్రాయెల్ తయారీ ఐరన్ డోమ్‌ను పోలి ఉంటుంది. ఇది విమానాలు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతోపాటు డ్రోన్‌లను 400 కి.మీ రేంజ్‌లో ఛేదించగలదు. ఇది 600 కి.మీ దూరంనుంచే శత్రువును కనిపెట్టే రాడార్ సామర్థ్యం ఉన్నది. ఒకేసారి 36 లక్ష్యాలను ఛేదించగలదు. ఇలాంటివి మన సైన్యం చేతిలో మూడు ఉన్నాయి. 2018లోనే 5.43 బిలియన్ల డాలర్లతో ఐదు S-400 స్క్వాడ్రన్లను కొనుగోలు చేసింది, అందులో 2023 నాటికి మూడు వినియోగంలోకి వచ్చాయి. మిగిలినవి ఈ ఏడాది చివరి నాటికి చేరుతాయి. ఇవి సరిహద్దుల సమీపంలోనే ఏర్పాటుచేయడంతో శత్రువు కదలికలను ఎప్పుడూ కనిపెడుతూ ఉంటాయి.
పాక్ క్షిపణులపై ప్రభావం
షాహీన్, అబాబీల్, బాబర్, రాద్ క్షిపణులను చేధిస్తాయి. అయితే, అబాబీల్, బాబర్ సామర్థ్యాలు ఎస్-400 లక్ష్య ఛేదన సామర్థ్యాన్ని సవాలు చేసే అవకాశం ఉన్నా.. ఆకాశ్, బరాక్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. ఫతాహ్-II క్షిపణి దాడి వ్యూహం ఎస్-400 సామర్థ్యాన్ని పరీక్షించే అవకాశం ఉన్నది. కానీ, దాటిపోయే అవకాశం తక్కువేనని సమాచారం. ఎందుకంటే ఎస్-400 వీహెచ్ఎఫ్ రాడార్లు తక్కువ ఎత్తులో ఎగిరే, వేగవంతమైన లక్ష్యాలను తేలికగా గుర్తించగలవు.
ఇతర రక్షణ వ్యవస్థలు
బరాక్-8: ఇది ఇండో-ఇజ్రాయెల్ సంయుక్తంగా తయారుచేసుకున్న వ్యవస్థ. దీని రేంజ్ 70-100 కి.మీ. ఇది బాబర్, రాద్ వంటి క్రూయిజ్ క్షిపణులను విమానాలను సునాయాసంగా చేధిస్తాయి. ఇది ఒకే వైపు నుంచి కాకుండా 360 డిగ్రీల్లో శత్రువు కదలికలను కనిపెడుతూ.. బహుళ లక్ష్యాలను చేధిస్తుంది.
ఆకాశ్: స్వదేశీయంగా తయారైన ఈ వ్యవస్థ రేంజ్ 30-70 కి.మీ. ఆకాశ్ మాక్ 2.5 వేగంతో లక్ష్యాలను చేధిస్తుంది. ఇది బాబర్ వంటి సబ్‌సోనిక్ క్షిపణులకు పక్కాగా నేలకూల్చుతుంది.
క్యూఆర్ సామ్: ఈ వ్యవస్థ రేంజ్ 25-30 కి.మీ. ఫతాహ్-II వంటి వేగంగా దూసుకువచ్చే లక్ష్యాలను నిమిషంలోపే అడ్డుకుంటుంది.
బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్: మనదేశంలో రెండు రకాల బీఎండీ వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, రెండోది అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్. 2,000 కి.మీ రేంజ్ కలిగిన బాలిస్టిక్ క్షిపణులను ఛేదించగలవు. ఇది షాహీన్ సిరీస్ ను అడ్డుకునేందుకు తయారుచేసుకున్నవి.
- Tags
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






