ఉస్మానియా యూనివర్సిటీలో జూలై 24న మెగా జాబ్ మేళా

by Kodari Anjali |

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ నెల 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీలో జూలై 24న మెగా జాబ్ మేళా
X

దిశ, సికింద్రాబాద్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ నెల 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీ సహకారంతో జరిగే ఈ జాబ్ మేళా ఉదయం 11 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో నిర్వహించబడుతుంది. ఈ జాబ్ మేళా ద్వారా అపోలో ఫార్మసీలో 100 ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ లేదా డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులని అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,500 నుంచి రూ.25,000 వరకు వేతనం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులతో జూలై 24న నేరుగా ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు. జాబ్ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం హెచ్‌ఆర్ ప్రతినిధి టి. రఘుపతి 82476 56356 ను సంప్రదించవచ్చని యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story