Breaking: ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-13 07:21:34  IST  )

ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య యుద్ధం జరుగుతోంది..

Breaking: ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్, ఇరాన్‌(Israel, Iran) మధ్య యుద్ధం జరుగుతోంది. దీంతో ఇరు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఇరాన్ వాయువ్య మార్గంపై సంచలన నిర్ణయం తీసుకుంది. తన గగనతలాన్ని మూసిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎయిర్ సంచలన నిర్ణయం తీసుకుంది. పలు విమానాలను దారి మళ్లింది. మరికొన్ని విమానాలను తిరిగి వెనక్కి పిలిపించింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దారి మళ్లింపు, తిరిగి వెనక్కి వచ్చిన విమానాల వివరాలను ప్రకటించింది. ప్రయాణీకుల అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ప్రయాణీకులకు వసతి కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణాన్ని రద్దు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని, రీ ఫండ్ సైతం ఇస్తామని వెల్లడించారు. అంతేకాదు వారిని గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

దారి మళ్లించి విమానాలు ఇవే..

AI130 – లండన్ హీత్రో-ముంబై రావాల్సిన విమానం వియన్నాకు మళ్లింపు

AI102 – న్యూయార్క్-ఢిల్లీ విమానం షార్జాకు మళ్లింపు

AI116 – న్యూయార్క్-ముంబై విమానం జెడ్డాకు మళ్లింపు

AI2018 – లండన్ హీత్రో-ఢిల్లీ ఫ్లైట్ ముంబైకు మళ్లింపు

AI106 – న్యూయార్క్-ఢిల్లీ – వియన్నాకు మళ్లింపు

AI188 – వాంకోవర్-ఢిల్లీ విమానం జెడ్డాకు మళ్లింపు

AI101 – ఢిల్లీ-న్యూయార్క్ – ఫ్రాంక్‌ఫర్ట్/మిలన్‌కు మళ్లింపు

AI126 – చికాగో-ఢిల్లీ – జెడ్డాకు మళ్లింపు

AI132 – లండన్ హీత్రో-బెంగళూరు విమానం షార్జాకు మళ్లింపు

AI2016 – లండన్ హీత్రో-ఢిల్లీ – వియన్నాకు మళ్లింపు

AI104 – వాషింగ్టన్-ఢిల్లీ – వియన్నాకు మళ్లింపు

AI190 – టొరంటో-ఢిల్లీ – ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లింపు

ఇండియాకు తిరిగొచ్చిన విమానాలు

AI189 – ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లి మధ్యలోనే ఢిల్లీకి తిరిగొచ్చిన విమానం

AI129 – ముంబై-లండన్ హీత్రో – ముంబైకి వచ్చేసిన విమానం

AI119 – ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లిన విమానం మార్గమధ్యలో ముంబైకి తిరిగి వచ్చేసింది.

AI103 – ఢిల్లీ-వాషింగ్టన్ – ఢిల్లీకి తిరిగి వచ్చింది.


Read More..

ఎయిరిండియా ప్రమాదం.. మేడే కాల్ దేనికి సంకేతం? ఫైలట్ ఎందుకు ఆ మేసేజ్ పంపించాడు!

Next Story