RRR అభిమానులకు బిగ్ షాక్.. బాంబ్ పేల్చిన జక్కన..

by  |
RRR
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల కానుందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వార్త వారికి బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో అభిమానులంతా దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెర దించుతూ ఆర్ఆర్ఆర్ టీమ్ సినిమా ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల కానుందని ప్రకటించింది.

అయితే ఈ ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల కావడం లేదు. కొన్ని అనివార్య కారణాల కారణంగా మూవీ టీం ట్రైలర్‌ రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేసింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ట్రైలర్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ట్వీటర్ వేదికగా తెలిపింది. దీంతో అభిమానులంతా నిరాశ చెందుతున్నారు. అయితే ఈ ట్రైలర్ డిసెంబర్ 10 విడుదల కానుందంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. సినీ సర్కిల్స్‌లోనూ ఇదే హాట్ టాపిక్‌గా ఉంది. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఆర్‌సీ15 రిలీజ్ అక్కడే.. క్లారిటీ ఇచ్చిన చెర్రీ

మాల్దీవుల్లో మత్తెక్కిస్తున్న ఇలియానా.. అది ఎవరబ్బ..


Next Story