- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెల్తీ డైట్‌తో 35kgలు తగ్గిన యువతి.. ఇన్‌ఫ్లుయెన్సర్ వెయిట్ లాస్ జర్నీ వైరల్
ముంబైకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మల్లికా ఫతేపురియా హెల్తీ డైట్, గంటల తరబడి జిమ్ లేకుండానే ఏకంగా 35 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ముంబైకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మల్లికా ఫతేపురియా హెల్తీ డైట్, గంటల తరబడి జిమ్ లేకుండానే ఏకంగా 35 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకప్పుడు 90 కిలోల బరువున్న ఆమె.. తన దైనందిన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఇప్పుడు 55 కిలోలకు చేరుకున్నారు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ స్టోరీ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బరువు తగ్గడం అంటే ఇష్టమైన ఆహారాన్ని మానేసి బాధపడటం కాదని, కొన్ని అలవాట్లను వదిలేస్తే చాలని ఆమె తన mallikafatehpuria ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
బరువు తగ్గేందుకు మల్లిక పాటించిన 4 ప్రధాన మార్పులు..
1. డైటింగ్‌కు స్వస్తి
తక్కువ వ్యవధిలో బరువు తగ్గాలనే లక్ష్యంతో చేసే కఠినమైన డైట్‌లను ఆమె మానేశారు. దానికి బదులుగా, జీవితకాలం పాటు సులభంగా, క్రమం తప్పకుండా పాటించగలిగే ఆరోగ్యకరమైన అలవాట్లపై దృష్టి పెట్టారు.
2. కార్బోహైడ్రేట్లు మానలేదు
బరువు తగ్గాలంటే అన్నం, బ్రెడ్, పాస్తా లాంటివి మానేయాలనే అపోహను ఆమె బ్రేక్ చేశారు. వాటిని పూర్తిగా మానేయకుండా, తినే పరిమాణాన్ని (Portion Control) మాత్రమే తగ్గించి, బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకున్నారు.
3. బోర్ కొట్టే భోజనం వద్దు
చప్పగా ఉండే డైట్ ఫుడ్ తింటూ శిక్ష అనుభవిస్తున్నట్లు ఫీల్ అవ్వకుండా, తనకెంతో ఇష్టమైన ఆహారాన్నే తీసుకున్నారు. అయితే, ఇంట్లో వండిన తేలికపాటి, పౌష్టికమైన, రుచికరమైన ఆహారాన్ని మితంగా తీసుకోవడం అలవాటు చేసుకున్నారు.
4. అతి వ్యాయామం చేయలేదు
బరువు తగ్గడానికి ప్రతిరోజూ జిమ్‌లో కఠినమైన వర్కవుట్స్ చేయాల్సిన అవసరం లేదని మల్లిక గుర్తించారు. దానికి బదులుగా.. రోజూవారీ వాకింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూ రోజంతా శారీరకంగా చురుగ్గా (Physical activity) ఉండటం అలవాటు చేసుకున్నారు. వీటితో పాటు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, తగినంత నిద్ర పోవడం, మానసిక ప్రశాంతతను అలవర్చుకోవడం తన వెయిట్ లాస్ జర్నీలో కీలక పాత్ర పోషించాయని ఆమె పేర్కొన్నారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తే ఆరోగ్యకరమైన బరువును సొంతం చేసుకోవచ్చని ఈ యువతి నిరూపించారు.






