- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎముకల బలహీనతకు కారణం అవుతున్న ఒబేసిటీ.. పరిష్కారం ఏమిటి?
కీళ్లలో ‘కార్టిలేజ్’ అనే మెత్తలాంటి కుషన్ ఉంటుంది. ఊబకాయం వల్ల ఇది త్వరగా అరిగిపోతుంది. ఫలితంగా కీళ్లపై ఒత్తిడి పెరుగుతుంది.

దిశ, ఫీచర్స్: ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని వేధిస్తున్న సమస్యల్లో ఊబకాయం ఒకటి. ఒకప్పుడు 40 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లోనే ఎక్కువగా కనిపించేది కానీ.. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అనేకమందిని ఇబ్బంది పెడుతోంది. అయితే ఇటీవలి అధ్యయనాలు మరో దీనిగురించి మరో విషయాన్ని కూడా గుర్తించారు. ఏంటంటే.. అధిక బరువు లేదా ఒబేసిటీ కేవలం గుండె, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచడంతోపాటు శరీరంలోని ఎముకల(Skeleton)పై కూడా ప్రతికూల ప్రభావం ప్రభావం చూపుతుందని వెల్లడించారు. మనిషి ఎదుగుదలకు సంబంధించి నిర్ధిష్ట బరువును మోసే ఎముకలు పరిమితికి మించి బరువు మోయడం ప్రమాదకరమని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
మృదులాస్థి అరిగిపోయి..
మానవ కీళ్లలో ‘కార్టిలేజ్’ అనే మెత్తలాంటి కుషన్ ఉంటుంది. అధిక బరువు ఉన్నవారిలో ఇది త్వరగా అరిగిపోతుంది. దీని కారణంగా కీళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా నడిచేటప్పుడు వెన్నుముక, తుంటి, మోకాళ్లపై దాదాపు 3నుంచి 4 రేట్ల అధిక ఒత్తిడి పడుతుంది. ఈ క్రమంలోనే కీళ్లలోని మృదులాస్థి (Cartilage) త్వరగా అరిగిపోయి ఆస్టియో అర్థరైటిస్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. పొట్ట భాగంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే వెన్నుముకతోపాటు నడుముభాగంలోని బోన్స్ వంగిపోతాయి. వెన్నుముకలో డిస్క్‌లు స్లిప్ అయితే సయాటికా, తీవ్రమైన నడుమునొప్పి వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు.
రక్త ప్రసరణపై ప్రభావం
బాడీలోని హెవీ కొలెస్ట్రాల్ కారణంగా ఎముకలు గుల్లబారే ప్రమాదం ఉంది. దీంతో చిన్న దెబ్బ తగిలినా ఫ్రాక్చర్ కావడం లేదంటే సులభంగా ఇరిగిపోతాయి. పాదాల నొప్పుల కారణంగా నడవడానికి ఇబ్బందిపడతారు. అధికబరువు ఉంటే ఎముకలకు అందాల్సిన రక్త ప్రసరణ సరిగా జరగదు. విటమిన్ డీ, కాల్షియం వంటి పోషకాలు అందవు. దీంతో ఎముకల పునరుత్పత్తి ప్రక్రియ నెమ్మదిస్తుంది. చిన్న వయసులోనే అధిక ఊబకాయం ఉంటే కాళ్లు వంకరగా మారే ప్రమాదం ఉండటంతోపాటు ఎదుగుదలలోనూ తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వయసు, ఎత్తుకు తగ్గట్లుగా బరువు ఉండటమే ఉత్తమని సూచిస్తున్నారు.
పరిష్కారం ఏమిటి?
కాల్షియం, విటమిన్ డీ సమృద్ధిగా ఉన్న పాలు, ఆకుకూరలు, గుడ్లు, చేపలు వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవడం, వారానికి 150 నిమిషాలు మోడరేట్ ఎక్సర్‌సైజ్ (వాకింగ్, స్విమ్మింగ్, యోగా), బరువు తగ్గడానికి క్యాలరీ డెఫిసిట్ డైట్ వంటివి ఊబకాయాన్ని తగ్గిస్తాయి. అలాగే డాక్టర్ సలహాతో ఫిజికల్ థెరపీ లేదా మెడికల్ వెయిట్ మేనేజ్‌మెంట్ అనుసరించాలి. ఇది కీళ్లపై ఒత్తిడిని తగ్గించి, ఎముకల పునరుత్పత్తిని మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక సమస్యలను నివారిస్తుంది. మొత్తానికి సమతుల్య ఆహారం, సరైన వ్యాయామం ద్వారా ఊబకాయాన్ని, తద్వారా తలెల్తే అనారోగ్యాలను నియంత్రించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






