ఆ చిన్న త‌ప్పిదం వ‌ల్లే, ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓడిపోయాం

by velandi.Saikiran |

ఆ చిన్న త‌ప్పిదం వ‌ల్లే, ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓడిపోయామ‌ని శ్రేయ‌స్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఆ చిన్న త‌ప్పిదం వ‌ల్లే, ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓడిపోయాం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐర్లాండ్ చేతిలో రెండు టీ20లో కూడా ఓటమి పాలైంది భారత జట్టు. ఈ క్రమంలో 2-0 తేడాతో ఈ టీ20 సిరీస్ ను ఐర్లాండ్ గెలుచుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అద్భుతంగా రాణించిన ఐర్లాండ్...టీ20 ఛాంపియన్స్ గా పేరు ఉన్న భారత్ ను తమ సొంత గడ్డపై మట్టి కరిపించింది. అయితే ఈ ఓటమిపై తాజాగా భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ గా ఈ ఓటమికి బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. ఈ సిరీస్ లో మొదటి నుంచి తమ ఆట ఏ మాత్రం సరిగ్గా లేదని వెల్లడించారు.

పాజిటివ్ మైండ్ సెట్ తో దిగి ఉంటే, మ్యాచ్ గెలిచే వాళ్ళమన్నారు. ముఖ్యంగా ఈ టీ20 సిరీస్ లో బ్యాటింగ్ లో భారత జట్టు విఫలమైనట్లు గుర్తు చేశారు. బ్యాటింగ్ కాస్త నిలకడగా చేసి ఉంటే, ఫలితం తారుమారయ్యేదని కీలక వ్యాఖ్యలు చేశారు శ్రేయస్ అయ్యర్. టీ20లలో గెలుపు, ఓటములు సహజమైనని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటానని స్పష్టం చేశారు. వచ్చే ఇంగ్లాండ్ సిరీస్ లో మెరుగ్గా ప్రదర్శన కనబరిచి.. సిరీస్ గెలుస్తామన్నారు.

Next Story