పారిస్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం

by velandi.Saikiran |

పారిస్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం ద‌క్కింది.

పారిస్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు ఒక్క ఫెయిల్యూర్ లేకుండా.. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా ఆయన దూసుకు వెళ్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమా లేట్ కావచ్చు కానీ.. ఇండస్ట్రీని షేక్ చేయడం మాత్రం గ్యారెంటీ. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వ‌స్తోన్న‌ వారణాసి సినిమాతో బిజీగా ఉన్నాడు జక్కన్న.

ఈ తరుణంలోనే ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న దర్శక ధీరుడు రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. అక్కడి ప్రతిష్టాత్మక ఆర్ట్స్ సెంటర్ సినిమాటిక్ ఫ్రాంచైజ్ లోని హెన్రీ లాంగ్లోయిస్ హాల్లో ఆయన పేరున నిర్వాహకులు పర్మనెంట్ సీటును కేటాయించారు. దిగ్గజో ఫ్రెంచ్ దర్శకుడు, ఆస్కార్ గ్రహీత కోస్టా ఆధ్వర్యంలో జక్కన్న ఈ గౌరవం అందుకున్నారు. తాను ఊహించలేని గౌరవం దక్కిందని ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు రాజమౌళి.

Next Story