రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..కరిగిపోయిన ట్రాఫిక్ లైట్స్

by velandi.Saikiran |

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు న‌మోదు అయిన త‌రుణంలో ట్రాఫిక్ లైట్స్ కరిగిపోయాయి.

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..కరిగిపోయిన ట్రాఫిక్ లైట్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: యూరప్ దేశాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అరుదైన ఒమేగా బ్లాక్ వాతావరణాన్ని నమూనా కారణంగా ఏర్పడిన ప్రాణాంతక, రికార్డు స్థాయి హీట్ వేవ్ పశ్చిమ యూరప్ ను కమ్మేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు పాఠశాలలు కూడా మూసివేశారు. ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు అత్యంత తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి.

ఈ యూరప్ లో వీస్తున్న వడగాల్పుల దాటికి ఓ అరుదైన సంఘటన కూడా చోటు చేసుకుంది. విపరీతమైన వేడికి ట్రాఫిక్ లైట్స్ కరిగిపోయాయి. ఇటలీ, జర్మనీలోని పలు నగరాలలో ఈ సంఘటనలు చోటు చేసుకున్న వీడియోలు వైరల్ గా మారాయి. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన ఈ తీవ్రమైన వడగాల్పులు తట్టుకోలేక ట్రాఫిక్ లైట్స్ వంకర తిరిగి కరిగిపోతున్నట్లు చెబుతున్నారు నిపుణులు. ట్రాఫిక్ లైట్సే కరిగిపోతుంటే.. ఆయా నగరాలలో మనుషుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Next Story