- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ కు బ్యాడ్ డే.. ఒకేరోజు రెండు ఓటములు
భారత్ కు బ్యాడ్ డే.. ఒకేరోజు రెండు ఓటములు చవి చూసింది భారత జట్టు.

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ కు జూన్ 28వ తేదీ బ్లాక్ డేగా మారింది. ఆదివారం రోజున రెండు దారుణమైన ఓటములను ఎదుర్కొంది భారత జట్టు. పాయింట్ల పట్టికలో ఎక్కడా జాడలేని ఐర్లాండ్ చేతిలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోని భారత జట్టు రెండు టీ20 ల సిరీస్ కోల్పోయింది. ఈ రెండు మ్యాచ్ లలో భారత జట్టు ఎక్కడ కూడా ప్రత్యర్థి ఐర్లాండ్ కు పోటీ ఇచ్చినట్లు కనిపించలేదు. వన్ సైడెడ్ గా మ్యాచ్ లు జరిగాయి.
ఇక అటు ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఆదివారం ఓడిపోయింది భారత జట్టు. ఆస్ట్రేలియాను ఓడించే క్రమంలో మహిళల భారత జట్టు చిత్తయింది. దీంతో ఈ టోర్నమెంట్ నుంచి మహిళల భారత జట్టు ఇంటిదారి పట్టింది. అటు దక్షిణాఫ్రికా మాత్రం సెమిస్ కు దూసుకు వెళ్ళింది. ఇలా ఆదివారం రెండు దారుణమైన ఓటములను చవి చూచింది భారత జట్టు. ఈ క్రమంలోనే జూన్ 28వ తేదీని బ్లాక్ డేగా పరిగణిస్తున్నారు క్రీడా విశ్లేషకులు.






