- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనది సాంస్కృతిక బంధం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీషెల్ పార్లమెంటులో నిన్న ప్రసంగించారు. ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధాని మోడీనే.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీషెల్ పార్లమెంటులో నిన్న ప్రసంగించారు. ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధాని మోడీనే. ఈ ప్రసంగంలో ఇరుదేశాల మధ్యనున్న లోతైన సాంస్కృతిక సంబంధాలను ఎత్తిపట్టారు. 250 ఏళ్ల కింద భారత్ నుంచి ఈ దీవిదేశానికి వచ్చారని గుర్తు చేశారు. నేడు వారంతా ఆధునిక సీషెల్ దేశంలో భాగమయ్యారని వివరించారు. సీషెల్ దేశ ప్రధాన బలం వారి జనాభానే అన్నారు. ప్రపంచదేశాల నుంచి తరతరాలుగా ఇక్కడి వలసవచ్చారని, అందుకే సీషెల్‌లో ఒక వైవిధ్య మూలాలున్న అస్తిత్వమున్నదని వివరించారు. భిన్నత్వంలో ఏకత్వ భావన ఇక్కడా ఉన్నదని తెలిపారు. సీషెల్, భారత్‌ల మధ్య అనేక సారూప్యతలున్నాయని ప్రస్తావిస్తూ.. ఇక్కడి ప్రజల నిత్యజీవితంలో కారి కోకో ఫ్లేవర్‌లు భారత్‌లోని సమోసా, చట్నీల వంటిదేనని తెలిపారు. ఇక్కడి ప్రజలు దీపావళిని జరుపుకుంటారని, గార్బా సంబురాలు జరుపుకుంటారన్నారు. ఈ ఉమ్మడి సంస్కృతి ఇరుదేశాల మధ్య మైత్రిని బలోపేతం చేస్తున్నదని, భావి స్నేహంపైనా సానుకూల ప్రభావం వేస్తున్నదని వివరించారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తాను పర్యటించిన తొలి ఆఫ్రికా దేశం సీషెల్ అని గుర్తు చేశారు. ఇరుదేశాల మధ్య హిందూ మహాసముద్రమున్నదని, ఇది రెండు దేశాలను విడదీయట్లేదని, కలుపుతున్నదని తెలిపారు. అందుకే మనం అపరిచితుల్లో కలవడం లేదని, పాత స్నేహితుల్లానే కలుస్తున్నామని వివరించారు.
హిందూ మహాసాగర భద్రత
‘హిందూ మహాసముద్రాన్ని ఒక అపార అవకాశాల గనిగా, అవకాశాలకు సాగరగనిగా మార్చాలనే లక్ష్యంగా చూడాలి. ఎందుకంటే ఈ మహాసాగరం మనకు ఉమ్మడి ఇల్లు. దీని భద్రత, రక్షణ, సంపద ప్రతీది మన ఉమ్మడి బాధ్యతే’ అని ప్రధాని మోడీ వివరించారు. సీషెల్స్‌తో తాము డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనుభవాలను పంచుకుంటామని తెలిపారు. భారత్, సీషెల్స్ భద్రత, రక్షణ ఇరుదేశాల బాధ్యతగానే చూస్తామన్నారు. రెండు దేశాల పారిశ్రామికాభివృద్ధి, భావి నిర్ణయాలకోసం కలిసి పని చేస్తామని, కనెక్టివిటీపెంచుకోవడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు.
సీషెల్స్‌తో తొమ్మిది ఒప్పందాలు
ప్రధాని మోడీ, సీషెల్స్ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ హెర్మినీలు ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ఆ తర్వాత ప్రతినిధులతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, అజిత్ దోవల్, విక్రమ్ మిస్రి, రణదీర్ జైస్వాల్‌లు పాల్గొన్నారు. భారత యూపీఐతోపాటు 9 ఎంవోయూలపై సంతకాలు జరిగాయి. సీషెల్స్‌లో భారత యూపీఐ సేవలు అందుబాటులోకి రానుండటంతో ఆర్థిక లావాదేవీలు సులభతరం కానున్నాయి.
ప్రధానికి ప్రతిష్టాత్మక పురస్కారం
సీషెల్స్ ప్రతిష్టాత్మక పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును ప్రధాని మోడీకి అందించారు. పర్యావరణ మార్పుల సవాళ్లపై పోరాడుతున్న దేశాలకు ఈ అవార్డును ప్రధాని మోడీ అంకితం చేశారు. మూడు రోజుల పర్యటనకు సీషెల్స్ వెళ్లిన ప్రధాని మోడీ నిన్న సీషెల్స్ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్నారు.
ఇంధన వినియోగం తగ్గించినందుకు థాంక్స్: ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 135వ మన్ కీ బాత్ ఎడిషన్ ప్రోగ్రామ్ నిన్న ఆలిండియా రేడియో, దూరదర్శన్, ఇతర వేదికలపై ప్రసారమైంది. ఈ ప్రసంగంలో ఆయన ఇంధన వినియోగాన్ని తగ్గించడంపై హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని తాను చేసిన విజ్ఞప్తిగా సానుకూలంగా స్పందించినందుకు పౌరులకు ధన్యవాదాలు తెలిపారు. చాలా మంది కార్‌పూలింగ్ ప్రారంభించారని, ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణించారని, విదేశీ పర్యటనలు వాయిదా వేసుకున్నారని, సహజ ఎరువుల వినియోగాన్ని ప్రారంభించారని వివరించారు. అలాగే, పెళ్లిళ్లకు కొత్త ఆభరణాలకు కొనడానికి బదులు పాత వాటినే రీసైకిల్ చేసుకున్నారన్నారు. తన విజ్ఞప్తికి మద్దతు ఇచ్చినందుకు ప్రతి పౌరుడికి ధన్యవాదాలు తెలిపారు.
రక్షణలో స్వావలంబన దిశగా
మన దేశం రక్షణ రంగంలో స్వాలంబన సాధిస్తున్నదని, ఆకాశం నుంచి సముద్ర జలాల వరకు రక్షణలో స్వీయ బలం పెరుగుతున్నదని ప్రధాని మోడీ మన్‌కీ బాత్‌లో పేర్కొన్నారు. మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సీ-295ని మన దేశం సొంతంగా తయారు చేసుకుందని, జూన్ 10న తొలి ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసిందని వివరించారు. మొత్తం 56 విమానాల్లో 40 విమానాలను ఎయిర్‌బస్‌తో కలిసి టాటా కంపెనీ వడోదరలోని ప్లాంట్‌లో తయారు చేస్తున్నదని తెలిపారు. ఈ విమానాల కోసం ఆర్మీ చేసుకున్న రూ. 21,935 కోట్ల డీల్‌తో ఎంఎస్ఎంఈలకు ఊతం లభించిందన్నారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించామని, ఇది మన అమ్ముల పొదిలో కొత్త అస్త్రమని వివరించారు. ఇటీవలే ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ శశాంక్, ఐఎన్ఎస్ ఆగ్ర్యలు భారత నేవీలో చేర్చామని గుర్తు చేశారు.






