- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోదరిని ఏడిపించాడని.. 10 ఏళ్ల దోస్తు తలనరికి చంపిన ముగ్గురు మైనర్లు!
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో అత్యంత పాశవికమైన ఘటన వెలుగుచూసింది. కేవలం 11 నుంచి 12 ఏళ్ల వయసున్న ముగ్గురు మైనర్లు కలిసి, తమ 10 ఏళ్ల స్నేహితుడిని అతి దారుణంగా తల నరికి హత్య చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో అత్యంత పాశవికమైన ఘటన వెలుగుచూసింది. కేవలం 11 నుంచి 12 ఏళ్ల వయసున్న ముగ్గురు మైనర్లు కలిసి, తమ స్నేహితుడి (10 ఏళ్ల వయసు)ని అతి దారుణంగా తల నరికి హత్య చేశారు. తమ సోదరిపై సదరు బాలుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ భయంకర ఘటనకు సంబంధించి నిందితులైన ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ముగ్గురూ ఒకే ప్లాన్ ప్రకారం బాధితుడైన అజ్మత్ (10)ను బయటకు వెళ్దామంటూ నమ్మించి పిలిచారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, మొదట గొంతు నులిమి చంపేశారు. అంతటితో ఆగకుండా కత్తితో అతని తలను శరీరం నుండి వేరు చేశారు. జూన్ 14 నుండి అజ్మత్ కనిపించకుండా పోగా.. జూన్ 25న ముహానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ డ్రైనేజీ పైపులో తల లేని మృతదేహం లభ్యమైందని జైపూర్ సౌత్ డీసీపీ రాజర్షి రాజ్ వర్మ తెలిపారు. బాడీ పూర్తిగా కుళ్ళిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో బిహార్‌లోని దర్భంగా ప్రాంతానికి చెందిన అతని కుటుంబ సభ్యులు దుస్తుల ఆధారంగా అజ్మత్‌ను గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు.
సోదరిని అన్న మాటలకే ఈ హత్య..
ఈ కేసులో పట్టుబడిన ముగ్గురు మైనర్లలో ఇద్దరు సొంత అన్నదమ్ములు కాగా, మరొకరు వారి మేనమామ కొడుకు. వీరంతా మృతుడు అజ్మత్‌కు పొరుగున ఉండేవారు. నెల రోజుల క్రితం నిందితుల సోదరిపై అజ్మత్ కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని, ఆ విషయంలో వీరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు చెప్పారు. చిన్న వయసే అయినా మనసులో పగ పెంచుకున్న ఆ ముగ్గురు బాలురు.. అజ్మత్‌ను అంతమొందించాలని స్కెచ్ వేశారు. జూన్ 14న ప్లాన్ అమలు చేసి, ఘాతుకానికి ఒడిగట్టాక శవాన్ని డ్రైనేజీ పైపులో పడేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ వయసు పిల్లల్లో ఇంతటి క్రూరత్వం చూసి పోలీసులు సైతం విస్మయానికి గురవుతున్నారు.






