వరల్డ్‌కప్ మ్యాచ్ కు కోహ్లీ, అనుష్క..వీడియో వైర‌ల్

by velandi.Saikiran |

మ‌హిళ‌ల వరల్డ్‌కప్ మ్యాచ్ కు కోహ్లీ, అనుష్క వ‌చ్చిన వీడియో వైర‌ల్ గా మారింది.

వరల్డ్‌కప్ మ్యాచ్ కు కోహ్లీ, అనుష్క..వీడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్: లండన్ లో సెటిల్ అయిన విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మ తాజాగా లార్డ్స్ స్టేడియంలో సందడి చేశారు. ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ మైదానంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ దంపతులు లార్డ్స్ మైదానానికి వచ్చారు. వీఐపీ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ తిలకించారు. అయితే ఇద్దరి పక్కన రవి శాస్త్రి కూడా మెరిశారు. దీంతో వీడియో వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉండగా, ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది భారత జట్టు. ఈ క్రమంలో లీగ్ నుంచి కూడా నిష్క్రమించింది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత్, 170 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని 19 ఓవర్స్ ఆడిన ఆస్ట్రేలియా, నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఇక ఆదివారం బంగ్లా పై విజయం సాధించిన దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లింది.

Next Story