- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్లమెంట్‌లో ‘మహిళా’ వార్: కేసీ వేణుగోపాల్ వర్సెస్ అమిత్ షా
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య వాడివేడి సంభాషణ జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభలో మూడు కీలక బిల్లులకు సంబంధించి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ (KC Venugopal) అన్ని బిల్లులపై సమగ్రంగా చర్చ జరగాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. 2024లోనే మహిళా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా 2023లోనే తాము మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చామని, అప్పుడేం చేశారని నిలదీశారు. రాజ్యాంగాన్ని ప్రభుత్వం హైజాక్ చేస్తోందని కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు.
ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాం.. అమిత్ షా
ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) జోక్యం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టకుండానే ఎలా చర్చ చేపడతారని, ఎలా ప్రశ్నిస్తారని అమిత్ షా అడిగారు. సభలో బిల్లు ప్రవేశపెట్టాక సభ్యులు తమతమ అభిప్రాయాలు చెప్పవచ్చని కౌంటర్ ఇచ్చారు. బిల్లు ప్రవేశపెట్టాక రూల్ 72 ప్రకారం ఒక్కొక్కరు తమ ప్రశ్నలను లేవనెత్తవచ్చని.. అప్పుడు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తామని అమిత్ షా బదులిచ్చారు.






