- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం హైజాక్ చేస్తోంది.. లోక్‍సభలో కేసీ వేణుగోపాల్
131వ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం హైజాక్ చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టగా ఈ బిల్లును అనుమతించాలా వద్దా అనే దానిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీ వేణుగోపాల్ ఈ బిల్లుకు అసలు కారణం వేరే ఉందని దుయ్యబట్టారు. ప్రజాప్రాతినిధ్య చట్టానికి రక్షణగా ఉన్న చట్టాన్ని మారుస్తున్నారని విమర్శించారు. 2023 లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చామని, 2024లో 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లు 2024 నుంచే అమలు చేయమని డిమాండ్ చేశామన్నారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలన్నారు.
పార్లమెంట్‌లో ‘మహిళా’ వార్: కేసీ వేణుగోపాల్ వర్సెస్ అమిత్ షా
Next Story






