కదులుతున్న కారులో హైకోర్టు మహిళా లాయర్ పై దారుణం.. నలుగురూ కలిసి ఘాతుకం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-19 05:46:54  IST  )

దేశంలో మరో దారుణ ఘటన జరిగింది. మ్యాట్రిమోనియల్ సైట్ లో పరిచయమైన వ్యక్తితో కలిసి పార్టీకి వెళ్లిన మహిళా లాయర్ పై కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారం చేశారు.

కదులుతున్న కారులో హైకోర్టు మహిళా లాయర్ పై దారుణం.. నలుగురూ కలిసి ఘాతుకం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మరో దారుణ ఘటన జరిగింది. మ్యాట్రిమోనియల్ సైట్ లో పరిచయమైన వ్యక్తితో కలిసి పార్టీకి వెళ్లిన మహిళా లాయర్ పై కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారం చేశారు. ఈ షాకింగ్ ఘటన పూణేలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాట్నాకు చెందిన బాధితురాలు పూణేలో LLB పూర్తి చేసి.. ముంబై హైకోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తోంది.

వృత్తిపరమైన పనిపై పూణేకు వచ్చిన ఆమె.. గత ఆదివారం అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో ఒక మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ఆదివారం సాయంత్రం కోరేగావ్ పార్క్ లోని ఫైవ్ స్టార్ హోటల్ కు రమ్మని పిలిచింది. అతను తనతోపాటు మరో ఇద్దరు మహిళలతో వెళ్లగా.. కొద్దిసేపు మాట్లాడుకుని ముగ్గురూ ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అదే హోటల్ లో ఆదివారం రాత్రి మద్యం సేవించే క్రమంలో.. పక్క టేబుల్ పై ఉన్న మరో ఇద్దరు వ్యక్తులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అంతా కలిసి పబ్ కు వెళ్లాలనుకున్నారు. కారులో వెళ్తుండగా.. నిందితుల్లో ఒకడు కదులుతున్న కారులోనే ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అంతేకాకుండా, ప్రయాణంలో నిందితులు తమ మరో ఇద్దరు స్నేహితులకు స్పీకర్‌ఫోన్‌లో కాల్ చేసి మహిళపై అసభ్యకరమైన కామెంట్లు చేశారని, కారులో ఉన్న మిగిలిన వారు కూడా అసభ్య శబ్దాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

ఆ తర్వాత బాధిత మహిళ ఒక స్థానికుడి సహాయంతో తన స్నేహితుడిని సంప్రదించి, కోరేగావ్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘోరంపై పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ స్పందిస్తూ.. "ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం, నాలుగో నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం" అని స్పష్టం చేశారు.

ఘోరం.. వివాహేతర సంబంధం నిలదీసినందుకు భర్తను సజీవ దహనం చేసిన భార్య, అత్త

Next Story