- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోరం.. వివాహేతర సంబంధం నిలదీసినందుకు భర్తను సజీవ దహనం చేసిన భార్య, అత్త
ఢిల్లీలో అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్తను భార్య, అత్త కలిసి సజీవ దహనం చేశారు. చనిపోయే ముందు బాధితుడు ఇచ్చిన స్టేట్‌మెంట్ వైరల్ అయింది.

దిశ, వెబ్ డెస్క్: తన భార్య పెట్టుకున్న వివాహేతర సంబంధం గురించి నిలదీసినందకు తన తల్లితో కలిసి భర్తకు నిప్పుపెట్టి సజీవ దహనం చేశారు. ఈ షాకింగ్ సంఘటన దేశ రాజధాని అయిన ఢిల్లీలో చోటు చేసుకుంది. నార్త్ వెస్ట్ జిల్లా జహంగీర్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ భయానక ఘటనకు సంబంధించి పోలీసులు నిందితులైన తల్లి, కూతుళ్లను కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 8:30 గంటల సమయంలో ఇంట్లో మంటలు చెలరేగగా, మొదట షార్ట్ సర్క్యూట్ అనుకున్నారు.
కానీ, అంతలోనే ఒక యువకుడు ఒంటిపై బట్టలు లేకుండా మంటల్లో కాలిపోతూ మెట్లపై నుండి కిందకు పడిపోయాడు. తీవ్రంగా గాయపడి మరణానికి చేరువలో ఉన్న ఆ యువకుడు చనిపోయే ముందు (Dying Declaration) ఇచ్చిన స్టేట్‌మెంట్ స్థానికంగా పెను సంచలనంగా మారింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ అధికారి ఆ యువకుడి ఆఖరి స్టేట్‌మెంట్‌ను తన ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఆ వాంగ్మూలంలో.. తన భార్య, అత్త మరొక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల సహాయంతో తనపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని బాధితుడు ఆరోపించాడు.
అంతేకాకుండా, తన భార్యకు వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధాలు (Extramarital Affairs) ఉన్నాయని, ఆ విషయమై గొడవ జరగడంతోనే తనను చంపేందుకు ప్లాన్ చేశారని వెల్లడించాడు. యువకుడు మంటల్లో కాలిపోతున్న సమయంలో కిందకు రావాలని పిలిచినా.. అతని భార్య రావడానికి నిరాకరిస్తూ "అతడిని అలాగే కాలిపోనివ్వండి" అంటూ క్రూరంగా మాట్లాడినట్లు ఇంటి యజమాని పోలీసులకు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఈ దారుణంపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.






