Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎తో షాక్‌లో పాక్... తర్వాత ప్లాన్ ఏంటి..? మరిన్ని ఉగ్రదాడులా..? లేక ఎదురుదాడికి దిగుతుందా..?

by Vennela |   (  Updated:2025-05-07 05:29:48  IST  )

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎తో షాక్‌లో పాక్... తర్వాత ప్లాన్ ఏంటి..? మరిన్ని ఉగ్రదాడులా..? లేక ఎదురుదాడికి దిగుతుందా..?
X

పాక్ ఇప్పుడు ఏం చేయబోతోంది?

భారత్‌లో మరిన్ని ఉగ్రవాద దాడులు

సరిహద్దులో షెల్లింగ్, సమీప గ్రామాలపై బాంబుల వర్షం

భారత్ టార్గెట్‌లపై మిసైల్స్ ప్రయోగం

దిశ, వెబ్ డెస్క్: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి. తొమ్మిది లక్షిత ప్రదేశాలపై జరిగిన మిస్సైల్స్ దాడుల్లో వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఊహించని పరిణామాలను పాకిస్తాన్ ఎలా ఎదుర్కొంటుంది అనేది ప్రపంచం ముందు పెద్ద మిస్టరీగా మిగిలింది. పాకిస్తాన్ ఈ దాడిని యుద్ధ చర్యగా ప్రకటించింది. మరోవైపు భారత్ మాత్రం పాకిస్తాన్ సైనిక, పౌర స్థావరాల పైన ఎలాంటి దాడులు జరగలేదని కేవలం ఉగ్రవాద స్థావరాల పైన మాత్రమే దాడులు జరిపామని భారత సైన్యం ప్రకటించింది. మరోవైపు పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయబోతుంది? అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది.

పాక్ ఇప్పుడు ఏం చేయబోతోంది?

పాకిస్తాన్ ప్రస్తుతం జరిగిన ఈ దారిని యుద్ధచర్యగా అభివర్ణించింది. ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ జరిగిన దాడిని ఖండించారు. మరోవైపు అటు లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో భారత్ వైపు నుంచి ఒక పౌరుడు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు భారత్ కూడా ఈ కాల్పులకు గట్టిగా ప్రతిస్పందిస్తోంది. అయితే పాకిస్తాన్ ఇప్పుడు జరిగిన దాడిని అంతర్జాతీయ సమాజం ముందు బయటపెట్టి సానుభూతి పొందాలని ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. అమెరికాను మధ్యవర్తిత్వం వహించమని కోరే అవకాశాలు కూడా ఉంటుంది ఇవాళ భారత్ పాకిస్తాన్ రెండు దేశాలకు సమస్యలు పరిష్కరించుకోమని, సామరస్య పూర్వకంగా వ్యవహరించమని సూచన చేశారు.

భారత్‌లో మరిన్ని ఉగ్రవాద దాడులు:

మరోవైపు భారత్ పైన మరిన్ని ఉగ్రదాడులు చేసేందుకు కూడా పాకిస్తాన్ సన్నద్ధం అయ్యే అవకాశం ఉన్నట్లు నిఘవర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయబా వంటి సంస్థలు పెద్ద ఎత్తున దాడులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ ఇప్పటికే అప్రమత్తమయింది.

సరిహద్దులో షెల్లింగ్, సమీప గ్రామాలపై బాంబుల వర్షం:

మరోవైపు పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో ఉన్న గ్రామాల పైన విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. దీని ద్వారా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం సృష్టించేందుకు పాకిస్తాన్ సిద్ధపడే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సమీప గ్రామాల పైన బాంబులు కురిపించడం ద్వారా ప్రాణ నష్టం పౌర నష్టం జరిపేందుకు కూడా పాకిస్తాన్ వెనకాడకపోవచ్చు. అయితే భారత బలగాలు మాత్రం ఇందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పవచ్చు.

భారత్ టార్గెట్‌లపై మిసైల్స్ ప్రయోగం:

మరోవైపు భారత్ పైన పాకిస్తాన్ కీలక సైనిక స్థావరాలపై మిస్సైల్స్ దాడి చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ దాడి ఎదురుకోవడం భారత్ కు పెద్ద కష్టతరం కాకపోవచ్చు అని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు ఎందుకంటే. భారత్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన క్షిపణి నిరోధక వ్యవస్థ (missile defence system) S-400 ట్రయంఫ్ (S-400 Triumph) ఉంది. దీని ద్వారా ఎలాంటి క్షిపణి వచ్చినా దానిని ఎదురుదాడి చేసి తుత్తునియ్యలు చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఐరన్ డోమ్ అని చెప్పవచ్చు. ఇలాంటి క్షిపణి నిరోధక వ్యవస్థ కేవలం అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, చైనా, భారత్ వద్ద మాత్రమే ఉన్నాయి.

Read More :

ఇండియన్ ఆర్మీ మరో విజయం.. లష్కర్ కీలక నేత హఫీజ్‌ అబ్దుల్ మాలిక్‌ హతం

Next Story