అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధాలు.. ఇవాళ రాత్రికి బాంబుల మోతే!

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-07 11:03:27  IST  )

ఇజ్రాయెల్‌కు అమెరికా భారీగా మందుగుండు సామాగ్రి సరఫరా చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా మారింది. నేడు రాత్రికి భారీ బాంబుల మోత తప్పదని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.

అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధాలు.. ఇవాళ రాత్రికి బాంబుల మోతే!
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (West Asia)లో యుద్ధం మరో కీలక దశకు చేరుకుంది. ఇజ్రాయెల్ (Israel) సైన్యానికి అండగా నిలుస్తున్న అమెరికా, అత్యంత భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రిని సరఫరా చేసింది. దీంతో ఇవాళ రాత్రికి యుద్ధం మరింత భీకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వారం రోజులుగా సాగుతున్న ఈ పోరాటంలో అగ్రరాజ్యం అమెరికా (America) తన ప్రమేయాన్ని పెంచుతూ, పెను విధ్వంసాన్నే సృష్టించింది.

అమెరికా వార్నింగ్.. రాత్రికి భారీ దాడులు?

తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ వర్గాలు కీలక హెచ్చరిక జారీ చేశాయి. ఇవాళ రాత్రి శత్రువుల స్థావరాలపై బాంబుల మోత మోగుతుందని, దాడులు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తీవ్ర స్థాయిలో ఉంటాయని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌కు ఇప్పటికే అత్యాధునిక క్షిపణులు, బాంబులను అమెరికా అందించడంతో, శత్రువుల కీలక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు సైన్యం సిద్ధమైంది. గత వారం రోజులుగా సాగుతున్న ఈ పోరాటంలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కలిసి పెను విధ్వంసాన్ని సృష్టించాయి. అమెరికా రక్షణ శాఖ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు శత్రువులకు చెందిన 3 వేల కంటే ఎక్కువ సైనిక లక్ష్యాలను నేలమట్టం చేశారు. ఇందులో కీలకమైన క్షిపణి ప్రయోగ కేంద్రాలు, ఆయుధ గిడ్డంగులు, కమాండ్ సెంటర్లు ఉన్నట్లుగా సమాచారం.

ఇజ్రాయిల్ ఆయుధ కారాగారం ఫుల్..

ఇజ్రాయెల్ అమ్ములపొదిలోకి అమెరికా నుంచి భారీగా ఆయుధ సంపత్తి వచ్చి చేరింది. ఎమర్జెన్సీ కింద వేల సంఖ్యలో గైడెడ్ బాంబులు (Guided bombs), క్షిపణి విడిభాగాలను అమెరికా పంపించింది. మిత్రదేశానికి రక్షణ కల్పించడం మా బాధ్యత అని చెప్తూనే, యుద్ధాన్ని ముగించే లోపు శత్రువును కోలుకోలేని దెబ్బ తీయాలని రెండు దేశాలు గట్టిగానే ప్లాన్ చేశాయి.

ఇరాన్ సైన్యం తుడిచిపెట్టుకుపోయింది.. డొనాల్డ్ ట్రంప్ కీలక స్టేట్‌మెంట్

Next Story