- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ సైన్యం తుడిచిపెట్టుకుపోయింది.. డొనాల్డ్ ట్రంప్ కీలక స్టేట్‌మెంట్
ఇరాన్ సైన్యం, నౌకాదళం, వైమానిక దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌పై అమెరికా (America), ఇజ్రాయెల్ (Israel) జరుపుతున్న సైనిక దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ సైనిక శక్తిని తాము పూర్తిగా నిర్వీర్యం చేశామని ప్రకటించారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇరాన్ తన రక్షణ వ్యవస్థలను కోల్పోయిందని పేర్కొన్నారు. ఇరాన్ సైన్యం అంతమైపోయిందని.. వారి నౌకాదళం (Navy) కనుమరుగైైందని, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు.
ఇరాన్ నాయకులు ఒకరి తర్వాత ఒకరు తుడిచిపెట్టుకుపోతున్నారని అన్నారు. ఇప్పటికే రెండు స్థాయిల నాయకత్వం అంతమైందని, ఇప్పుడు వారు మూడో స్థాయి నాయకత్వంతో నెట్టుకొస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇరాన్ వద్ద ఉన్న 32 నౌకలు ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్నాయని.. అసలు ఆ దేశానికి నౌకాదళం అనేదే ఇప్పుడు లేదన్నారు. ఇక వైమానిక దళం (Air Force) విషయానికి వస్తే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని వారికి ఇప్పుడు గగనతల రక్షణే లేదని డొనాల్డ్ ట్రంప్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.






