తొలిసారి ఎన్డీఏకు ఓటమి రుచి చూపించాం.. ప్రియాంకా గాంధీ ఘాటు వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-18 10:58:17  IST  )

మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై ప్రియాంక గాంధీ ఎన్డీఏపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తొలిసారి ఎన్డీఏకు ఓటమి రుచి చూపించాం.. ప్రియాంకా గాంధీ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె ఢిల్లీ (Delhi)లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఇది అధికార ఎన్‌డీఏ (NDA) కూటమికి ఒక చీకటి రోజని, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఓటమి రుచి చూపించామని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న సభలో పరిణామం ప్రజాస్వామ్యానికి దక్కిన గొప్ప విజయమని కామెంట్ చేవారు. సమాఖ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలపై ప్రతిపక్షాల ఐక్యత సాధించిన విజయమి ఇదని ఆమె కొనియాడారు.

అధికారంలో శాశ్వతంగా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద కుట్ర పన్నిందని ప్రియాంకా ఆరోపించారు. రిజర్వేషన్ల పేరుతో లోక్‌సభ స్థానాల సంఖ్యను భారీగా పెంచాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని, అందుకే ప్రతిపక్షాలు దీనిని అడ్డుకున్నాయని ఆమె స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఇస్తామంటూ మహిళలను మభ్యపెట్టాలని ప్రభుత్వం చూస్తోందని, కానీ దేశంలోని మహిళలు అంత అమాయకులు కాదని ఆమె అన్నారు. ఉన్నావ్‌ (Unnaav), హాథ్రస్ (Hathras) ఘటనలను మనం చూశామని.. మణిపూర్‌ (Manipur)లో మహిళలపై దాడులు జరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడ ఉందని ఫైర్ అయ్యారు. మహిళల పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, 2023లో ప్రవేశపెట్టిన పాత వెర్షన్ బిల్లును తీసుకురావాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు.

వాళ్లకు పట్టిన పరిస్థితే చంద్రబాబుకు.. రేవంత్‍రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

Next Story