సంఖ్యా బలం ఉంది.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వండి: గవర్నర్‌‌ను రిక్వెస్ట్ చేసిన విజయ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-07 06:24:27  IST  )

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు.

సంఖ్యా బలం ఉంది.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వండి:  గవర్నర్‌‌ను రిక్వెస్ట్ చేసిన విజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న తమిళ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ (Vijay), రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు నేడు ఆయన లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ (Rajendra Vishwanath Arlekar)తో ప్రత్యేకంగా భేటీ అయి ప్రభుత్వ ఏర్పాటు వినతి పత్రం అందజేశారు. అందులో తమకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన సంఖ్యా బలం ఉందని, అందుకు అవకాశం కల్పించాలని విజయ్ గవర్నర్‌ను కోరారు. తమకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌కు వివరించారు. అవకాశం ఇస్తే అసెంబ్లీ వేదికగా తమ బలాన్ని నిరూపించుకుంటానని విజయ్ స్పష్టం చేశారు.

లేదంటే సుప్రీంకోర్టుకు..

కాగా, ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే విజయ్ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లుగా టీవీకే వర్గాలు తెలిపాయి. మరోవైపు, మద్దతును కూడగట్టేందుకు చిన్న పార్టీల నేతలతో టీవీకే ముఖ్య నాయకులు వరుసగా మంతనాలు జరుపుతున్నారు.

తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్.. లోక్‌భవన్‌కు విజయ్, పళని స్వామి

తమిళనాడు సీఎంగా తలపతి విజయ్.. ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!

Next Story