తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్.. లోక్‌భవన్‌కు విజయ్, పళని స్వామి

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-07 05:35:16  IST  )

తమిళనాడులో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది.

తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్.. లోక్‌భవన్‌కు విజయ్, పళని స్వామి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamilnadu) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన నెంబర్ గేమ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో నటుడు విజయ్ (Vijay) నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను సాధించేందుకు ఇతర పార్టీల మద్దతు కూడగట్టే పనిలో విజయ్ నిమగ్నమయ్యారు.

గవర్నర్ కేరళ పర్యటన వాయిదా..

రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండటంతో తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Vishwanath Arlekar) తన కేరళ పర్యటనను వాయిదా వేసుకున్నారు. విజయ్ మరికాసేపట్లో గవర్నర్‌ను కలిసేందుకు లోక్‌భవన్‌కు వెళ్లనున్నట్లుగా సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటు మరియు మద్దతుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఏఐఏడీఎంకే (AIADMK) అధినేత ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) కూడా గవర్నర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడులో అసలు కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

కొత్త ప్రభుత్వం దిశగా అడుగులు.. గవర్నర్‌తో TVK చీఫ్ విజయ్ భేటీ

Next Story