కొత్త ప్రభుత్వం దిశగా అడుగులు.. గవర్నర్‌తో TVK చీఫ్ విజయ్ భేటీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-07 05:34:30  IST  )

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ మరోసారి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన గవర్నర్‌కు కలిసేందుకు లోక్‌భవన్ వెళ్లారు.

కొత్త ప్రభుత్వం దిశగా అడుగులు.. గవర్నర్‌తో TVK చీఫ్ విజయ్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన తమిళ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ (Vijay), ఇవాళ ఇంచార్జ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ (Rajendra Vishwanath Arlekar)తో భేటీ అయ్యారు. లోక్‌భవన్‌కు చేరుకున్న ఆయన తన పార్టీకి ఉన్న బలాన్ని వివరిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. రాష్ట్రంలో మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే ఒంటరిగా 108 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఈ క్రమంలో 5 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తమ పూర్తి మద్దతును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తన కేరళ పర్యటనను వాయిదా వేసుకున్న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, విజయ్ సమర్పించే బలాబలాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఏఐఏడీఎంకే (AIADMK) అధినేత ఎడప్పాడి పళనిస్వామి కూడా గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్.. లోక్‌భవన్‌కు విజయ్, పళని స్వామి

Next Story