చిక్కుల్లో రాహుల్ గాంధీ.. సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైన కేంద్రం

by Prasad Jukanti |   (  Updated:2026-02-11 11:15:59  IST  )

లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది.

చిక్కుల్లో రాహుల్ గాంధీ.. సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైన కేంద్రం
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఇవాళ సభలో భారత్-యూఎస్ ట్రేడ్ డీల్ పై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కేంద్రం ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాని సిద్ధమైనట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రధాని మోడీ, మంత్రి హర్దీప్ సింగ్ పై రాహుల్ నిరాధారమైన ఆరోపణలు చేశారని కిరణ్ రిజిజు మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు స్పీకర్ కార్యాలయంలో వివరణ ఇవ్వాలని కేంద్రం కోరబోతున్నట్లు తెలిసింది. కిరణఅ రిజిజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు లోక్‌సభను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. లోక్‌సభ, రాజ్యసభల్లో పని తీరుకు సంబంధించి స్పష్టమైన నియమాలు ఉన్నాయని ఎవరైనా ఒక సభ్యుడు మరొక సభ్యుడిపై తీవ్రమైన ఆరోపణలు చేయాలనుకుంటే ముందుగా నోటీసు ఇవ్వాలి, అలాగే ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. కానీ రాహుల్ గాంధీ అవేవి పాటించలేదన్నారు.కాగా ఒక వేళ కేంద్రం రాహుల్ గాంధీకి ప్రివిలేజ్ నోటీసు ఇస్తే ఈ పరిణామం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి. గత టర్మ్ లోనూ రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు పడింది.

Rahul Gandhi: భరత మాతను అమ్ముకోవడానికి సిగ్గుగా లేదా? మోడీ సర్కార్‍పై రాహుల్

Next Story