Rahul Gandhi: భరత మాతను అమ్ముకోవడానికి సిగ్గుగా లేదా? మోడీ సర్కార్‍పై రాహుల్

by Prasad Jukanti |   (  Updated:2026-02-11 11:17:57  IST  )

ఇండియా యూఎస్ డీల్ పై రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi: భరత మాతను అమ్ముకోవడానికి సిగ్గుగా లేదా?  మోడీ సర్కార్‍పై రాహుల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం మనం పూర్తిగా యూఎస్‍కు సరెండర్ కావడంతో సమానమని లోక్‍సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సుంకాలను తగ్గించిందని మన ప్రభుత్వం భారతీయ డేటాను వారికి అప్పగించడంతో పాటు, విదేశీ సంస్థలకు20 ఏళ్లు ట్యాక్స్ హాలిడే ప్రకటించిందని ధ్వజమెత్తారు. మన రైతులను యాంత్రీకరణతో కూడిన అమెరికన్ వ్యవసాయంతో పోటికి గురి చేస్తోందని, వస్త్ర రంగాన్ని బలహీనపరిచిందని మరియు ఇంధన భద్రతను రాజీ పడేసిందని ఆయన పేర్కొన్నారు. భారతమాతను అమ్ముకోవడానికి మీకు సిగ్గుగా లేదా అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇవాళ లోక్ సభలో మాట్లాడిన ఆయన.. ప్రపంచంలో మారుతున్న కీలక పరిణామాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‍లో ఏ మాత్రం ప్రతిబింబించలేదని విమర్శించారు. ప్రాంతీయ అస్థితరతపై తీసుకుంటున్న చర్యలేవి బడ్జెట్ లో లేవన్నారు.

వారికి మన డేటా అవసరం:

ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళ్తుందని చెబుతున్నారు. ఏఐ ప్రభావంతో భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నరని రాహుల్ గాంధీ అన్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల ఉద్యోగులకు ఏఐ ప్రమాదం పొంచి ఉందన్న వాదనలు ఉన్నాయని అమెరికా సూపర్ పవర్ గా ఉండాలంటే వారికి ఇండియా డేటా అవసరం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 21వ శతాబ్ధంలో మనల్ని సూపర్ పవర్ గా మార్చేది డేటానే అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం చేసుకుందని ఈ ఒప్పందం వెనుక కీలక అంశాలు ఉన్నాయని ఆరోపించారు.

మనం అమెరికాతో సమానం, పాకిస్తాన్‍తో కాదు:

మనం అమెరికాతో సమానం, పాకిస్తాన్‍తో కాదన్నారు. అమెరికా కంపెనీలకు ట్యాక్స్ హాలిడే ఇచ్చారని, టెక్స్ టైల్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఇందన భద్రను పూర్తిగా వదిలేశారని మన దేశం చమురు ఎవరి నుంచి కొనుగోలు చేయాలన్నిది అమెరికా నిర్ణయిస్తోందన్నారు. యూఎస్ డీఎల్ జరిగిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.డాలర్ విలువ బలంగా ఉండాలంటే మన డేటా అమెరికాకు అవసరం అన్నారు. ప్రపంచ దేశాలు యుద్ధాల వైపు వెళ్తున్నాయని అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని చైనా, రష్యా ప్రశ్నిస్తున్నాయన్నారు. మన దేశ ప్రజలకు ఏ దేశంతోనైనా పోటీ పడే సామర్థ్యం ఉంది. మీ రైతుతులను కాపాడుకున్నట్లే మా రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యమంత్రి ట్రంప్‍కు భారత ప్రభుత్వం చెప్పాలన్నారు.

చిక్కుల్లో రాహుల్ గాంధీ.. సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైన కేంద్రం

Next Story