- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
15 రోజులు భర్తతో.. 15 రోజులు ప్రియుడితో.. పంచాయితీ పెట్టి షాక్ ఇచ్చిన భార్య..
ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో ఓ వింత కథ వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పెళ్లి జరిగిందంటే భర్తకే కట్టుబడి ఉండాలి భార్య. కానీ ఈ మధ్య కొందరు ఆధునికత పేరుతో హద్దులు మీరుతున్నారు. ఒక్కరితోనే జీవితం ఎందుకు ముగిసిపోవాలంటూ రెచ్చిపోతున్నారు. భర్తకు తెలియకుండా ఇల్లీగల్

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో ఓ వింత కథ వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పెళ్లి జరిగిందంటే భర్తకే కట్టుబడి ఉండాలి భార్య. కానీ ఈ మధ్య కొందరు ఆధునికత పేరుతో హద్దులు మీరుతున్నారు. ఒక్కరితోనే జీవితం ఎందుకు ముగిసిపోవాలంటూ రెచ్చిపోతున్నారు. భర్తకు తెలియకుండా ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ మెయింటెన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా పెళ్లై ఏడాదిన్నర అయిన ఓ వివాహిత మహిళ.. ఏడాదిలో తన ప్రేమికుడితో దాదాపు పది సార్లు పారిపోయింది. ఇక ఇలా పారిపోవడం, రావడం కష్టం అనుకుందో ఏమో.. గ్రామంలో పంచాయితీ పెట్టింది.
తాను నెలలో పదిహేను రోజులు భర్తతో, మరో పదిహేను రోజులు ప్రియుడితో ఉంటానని.. ఇందుకు అనుమతించాలని గ్రామ పెద్దలను కోరింది. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ఏ ధైర్యంతో ఈ డిమాండ్ చేస్తుందని ఆశ్చర్యపోయారు. ఇదంతా చూసి తట్టుకోలేని భర్త.. ‘నన్ను క్షమించు.. నీ ప్రియుడితోనే వెళ్లి హాయిగా బతుకు’ అని వేడుకున్నాడు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇలాంటి మంచి మంచి కట్టుబాట్లు ఎలా వస్తాయని విమర్శిస్తున్నారు నెటిజన్లు.
Read More : పోర్న్ సైట్‌లో ప్రధాని ఫొటోలు.. పెను దుమారం రేపిన ఘటన






