- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోర్న్ సైట్‌లో ప్రధాని ఫొటోలు.. పెను దుమారం రేపిన ఘటన
పోర్న్ వెబ్ సైట్‌లో ప్రధాని మార్ఫింగ్ ఫొటోలు దర్శనమివ్వడం తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: పోర్న్ వెబ్ సైట్ లో ప్రధాని మార్ఫింగ్ ఫొటోలు దర్శనమివ్వడం తీవ్ర కలకలం రేపింది. ఇటలీ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనితోపాటు పలువురు ప్రముఖ మహిళ ఫొటోలు పోర్న్ వెబ్ సైట్ ఫికాలో కనిపించడం పెనుదుమారానికి దారితీసింది. ఈ ఘటనతో సుమారు 7 లక్షలమంది సబ్ స్క్రైబర్లు ఉన్న ఆ వెబ్ సైట్ ను నిర్వాహకులు మూసివేశారు. ఈ ఘటనపై మెలోనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యతో అవమానానికి, వేధింపులకు గురైన మహిళలకు తన సంఘీభావం, మద్దతు ఉంటాయని తెలిపారు.
ప్రతిపక్ష నేత ఎల్లీ ష్లీన్ ఫొటోలు కూడా మార్ఫింగ్ చేసి పెట్టడంతో.. సమాజంలో వేళ్లూనుకుపోయిన రేప్ కల్చర్ కు ఇది నిదర్శనమని ఆరోపించారామె. మనుషుల్లో వికృత మనస్తత్వాలను రెచ్చగొట్టేందుకు ఇలాంటి వెబ్ సైట్లే వేదికలవుతున్నాయన్నారు. కాగా.. ఫికా వెబ్ సైట్లో కేవలం భర్తలకు మాత్రమే ఎంట్రీ ఉంటుందని ఒక బాధితురాలు తెలిపారు. 2005 నుంచీ ఈ వెబ్ సైట్ ఉన్నా ఇన్నాళ్లూ దానిపై చర్యలు తీసుకోలేదు. భర్తలు తమ భార్యలు లేదా గర్ల్ ఫ్రెండ్స్ ఫొటోలు, హస్తప్రయోగం చేసిన ఆధారాలను పోస్ట్ చేసి, దానికింద వికృత కామెంట్లు చేసి పైశాచిక ఆనందం పొందుతారని ఆమె తెలిపారు.
15 రోజులు భర్తతో.. 15 రోజులు ప్రియుడితో.. పంచాయితీ పెట్టి షాక్ ఇచ్చిన భార్య.
పోర్న్ సైట్ నడిపిస్తున్న 12ఏళ్ల బాలిక.. దేశానికే సవాల్ విసిరిన కథ..






