- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నైనీ కోల్ బ్లాక్ వ్యవహారం.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ మీటింగ్
నైనీ కోల్ బ్లాక్ వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అధికారులు సింగరేణితో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ మొదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: నైనీ కోల్ బ్లాక్ వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అధికారులు సింగరేణితో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ మొదలైంది. ఈ సమావేశంలో నైనీకోల్ బ్లాక్, మైనింగ్ టెండర్ల వివాదం, ఇతర అంశాలపై సమీక్షిస్తోంది. సింగరేణి అధికారులతో ఈ సమావేశం కొనసాగుతోంది.
నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డిలకు సంబంధించిన బంధువులు భారీ ఎత్తున అవినీతి పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. నిన్న (మంగళవారం) హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి కుంభకోణంలో కిషన్ రెడ్డి కుమ్మక్కు అవ్వకపోతే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నైనీకోల్ బ్లాక్ అండ్ మైనింగ్ టెండర్ల వ్యవహారంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. హై లెవల్ మీటింగ్ తర్వాత దీనిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Read More..






