ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహిత.. ప్రముఖ పర్యావరణ వేత్త మాధవ్‌ గాడ్గిల్‌ కన్నుమూత

by Ramesh Naini |   (  Updated:2026-01-08 05:58:16  IST  )

ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్‌ మాధవ్‌ గాడ్గిల్‌ (83) కన్నుమూశారు. స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి పుణెలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు గురువారం వెల్లడించాయి.

ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహిత.. ప్రముఖ పర్యావరణ వేత్త మాధవ్‌ గాడ్గిల్‌ కన్నుమూత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్‌ మాధవ్‌ గాడ్గిల్‌ (83) కన్నుమూశారు. స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి పుణెలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు గురువారం వెల్లడించాయి. కాగా, భారత్‌లోని అత్యంత సున్నితమైన జీవ వైవిధ్య ప్రాంతమైన పశ్చిమ కనుమల పరిరక్షణలో డాక్టర్‌ గాడ్గిల్‌ చేసిన కృషి అపూర్వమైనది. జనాభా ఒత్తిడి, వాతావరణ మార్పులు, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావాలను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘వెస్టర్న్‌ ఘాట్స్‌ ఎకాలజీ ఎక్స్‌పర్ట్‌ ప్యానెల్‌’కు ఆయన ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఈ కమిటీ నివేదిక పర్యావరణ పరిరక్షణపై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

పర్యావరణ పరిరక్షణ రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను ఐక్యరాజ్యసమితి 2024లో ఆయనకు ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ అవార్డును ప్రదానం చేసింది. ఇది ఐక్యరాజ్యసమితి అందించే అత్యున్నత పర్యావరణ గౌరవం కావడం విశేషం. డాక్టర్‌ గాడ్గిల్‌ మృతి పర్యావరణ రంగానికి తీరని లోటుగా పలువురు నిపుణులు, కార్యకర్తలు పర్యావరణ పేర్కొన్నారు. ఆయన సేవలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పర్యావరణ వర్గాలు నివాళులర్పించాయి.

Read More..

భారత్‌కు భారీ షాక్.. 500 శాతం టారిఫ్‌లు విధించే యోచనలో ట్రంప్?

Next Story