- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అబ్బాయిలపై ఇంట్రెస్ట్ లేదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు
ఈ మధ్య కాలంలో అబ్బాయిలు అమ్మాయిలే కాకుండా అమ్మాయిలతో అమ్మాయిలు.. అబ్బాయిలతో అబ్బాయిలు ప్రేమలో పడుతున్న వింత ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో అబ్బాయిలు అమ్మాయిలే కాకుండా అమ్మాయిలతో అమ్మాయిలు.. అబ్బాయిలతో అబ్బాయిలు ప్రేమలో పడుతున్న వింత ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. డేటింగ్ యాప్స్ లో ఒకే ఫీలింగ్స్ ఉన్న యువతులు, యువకులు పరిచయాలు పెంచుకుని తరవాత పెళ్లిళ్లు సైతం చేసుకుంటున్నారు. కేవలం డేటింట్ యాప్స్ లోనే కాకుండా ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా వేధికలను సైతం దీనికోసం వాడుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే బిహార్‌లో చోటు చేసుకుంది.
పూజా(21), కాజల్(18) అనే ఇద్దరు యువతులకు ఇన్ స్టాలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ తరచూ చాటింగ్ చేసుకోవడం, ఫోన్లు చేసుకోవడం మొదలు పెట్టారు. తరవాత ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిపోయారు. ఈ క్రమంలోనే బీహార్ లోని సుపోల్ జిల్లాలో ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తమకు అబ్బాయిలపై ఆసక్తి లేదని, రెండేళ్లుగా ప్రేమలో ఉన్నామని చెప్పారు. తమ కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నా పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరూ ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నట్టు తెలిపారు.
Read More..
అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడొద్దు.. గ్రామపంచాయితీలో పెద్దల తీర్మాణం






