అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడొద్దు.. గ్రామపంచాయితీలో పెద్దల తీర్మాణం

by Ajay Maddhiboyina |

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరి దగ్గర చూసినా స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో కూడా రాజస్థాన్‌లోని ఓ పంచాయితీ పెద్దలు అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడటాన్ని

అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడొద్దు.. గ్రామపంచాయితీలో పెద్దల తీర్మాణం
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరి దగ్గర చూసినా స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో కూడా రాజస్థాన్‌లోని ఓ పంచాయితీ పెద్దలు అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడటాన్ని నిషేధించారు. అంతే కాకుండా స్మార్ట్ ఫోన్ వాడొద్దని పంచాయితీలో తీర్మాణం కూడా చేశారు. రాజస్థాన్ జలోర్ లోని గాజీపూర్ గ్రామపంచాయితీలో ఇలా పంచాయితీ పెద్దలు తీర్మాణం చేశారు. పంచాయితీ పరిధిలోని 15 గ్రామాలకు చెందిన కోడళ్లు, యువతులు స్మార్ట్ ఫోన్లు వాడకూడదని ఆంక్షలు విధించారు.

అయితే కొన్నిసార్లు అవసరం కాబట్టి కీ ప్యాడ్ ఫోన్లకు మాత్రం అనుమతిచ్చారు. జనవరి 26 నుండి ఈ రూల్స్ అమలులోకి వస్తాయని తీర్మాణంలో పేర్కొన్నారు. వివాహాలు, ఇతర కార్యక్రమాలకు కూడా ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధించారు. చిన్న పిల్లల కంటిచూపు దెబ్బ తినకుండా ఉండేలనే ఈ నిర్ణయం తీసుకున్నామని పెద్దలు పేర్కొన్నారు. ఇక ఈ వార్త కాస్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అమ్మాయిలు వాడితేనే చిన్నపిల్లల కండిచూపు దెబ్బతింటుందా.. అబ్బాయిలు వాడితే ఎలాంటి సమస్య లేదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Next Story