చారిత్రాత్మక శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ బోనాల ఉత్సవాలకు కేటీఆర్‌కు ఆహ్వానం

by Kodari Anjali |

ఆగస్టు 9న నిర్వహించనున్న 78వ వార్షిక బోనాల మహోత్సవాలకు కేటీఆర్ ను ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

చారిత్రాత్మక శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ బోనాల ఉత్సవాలకు కేటీఆర్‌కు ఆహ్వానం
X

దిశ, చంపాపేట్: హైదరాబాద్ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన చారిత్రాత్మక శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి (హరిబౌలి)ఆలయంలో ఆగస్టు 9న నిర్వహించనున్న 78వ వార్షిక బోనాల మహోత్సవాలకు హాజరుకావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఆలయ కమిటీ ప్రతినిధుల బృందం ఆయనను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను వివరించిన కమిటీ సభ్యులు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ప్రతి ఏడాది వేలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగే ఈ బోనాల ఉత్సవాలకు ఈసారి కూడా రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ కమిటీ పేర్కొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు డి. ప్రభాకర్, కార్యదర్శి కె. దత్తాత్రేయ, కోశాధికారి ఏ. సతీష్, కార్యనిర్వహక కార్యదర్శి ఎస్.పి. క్రాంతి కుమార్, ఉపాధ్యక్షులు జగ్మోహన్ కపూర్, ఎం. వినోద్ కుమార్, సభ్యులు పి. సాయికిరణ్, రవీందర్ చారి, ఎల్. అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story