- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ కాలేజీ బస్సును ఢీకొట్టిన రైలు.. 20 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు
తమిళనాడులోని కరూర్ సమీపంలో శనివారం ఒక భయానక ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని కరూర్ సమీపంలో శనివారం ఒక భయానక ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలపై నిలిచిపోయిన ఒక ప్రైవేట్ కాలేజీ బస్సును గూడ్స్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఒక ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు విద్యార్థులతో వెళ్తుండగా వెల్లియనై ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది. అయితే, దురదృష్టవశాత్తు బస్సు పట్టాలపైనే నిలిచిపోయింది(Stuck). అదే సమయంలో ఒక ప్రైవేట్ సిమెంట్ ప్లాంట్ కోసం కంకర రాళ్లను తీసుకెళ్తున్న గూడ్స్ రైలు వేగంగా వచ్చి బస్సును బలంగా ఢీకొట్టింది.
తీవ్ర ప్రభావం - ఆరుగురి పరిస్థితి విషమం
రైలు ఢీకొట్టిన ధాటికి బస్సు తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మొత్తం 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను కరూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం సదరు విద్యార్థులు ఐసీయూ (ICU)లో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. పట్టాలపై బస్సు ఎందుకు ఆగిపోయింది? సిగ్నల్ వ్యవస్థలో లోపమా లేక డ్రైవర్ అజాగ్రత్తా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






