- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహామన ఎక్స్‌ప్రెస్‌లో పొగలు: భయాందోళనలో ప్రయాణికులు..!
భోపాల్ నుండి ఖజురహో వెళ్తున్న మహామన ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్: 22163)లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: భోపాల్ నుండి ఖజురహో వెళ్తున్న మహామన ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్: 22163)లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. లలిత్‌పూర్ - టీకంగఢ్ మధ్య ఉన్న ఉదయపుర రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం రైలు లలిత్‌పూర్ దాటిన తర్వాత, D-4 బోగీలో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. బోగీ అంతా పొగతో నిండిపోవడంతో రైలులో మంటలు అంటుకున్నాయని భావించిన ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. పరిస్థితిని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే ఉదయపుర స్టేషన్ వద్ద రైలును నిలిపివేశారు.
ప్రయాణికుల పరుగులు..
రైలు ఆగగానే ప్రయాణికులు తమ లగేజీలతో సహా బోగీల నుండి కిందికి పరుగులు తీశారు. సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు స్టేషన్ ఆవరణలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై టీకంగఢ్ అసిస్టెంట్ రైల్వే స్టేషన్ మాస్టర్ స్పందించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. రైలు చక్రాలకు ఉండే 'బ్రేక్ షూ'లు జామ్ అవ్వడం (Brake Binding) వల్ల ఘర్షణ ఏర్పడి పొగలు వచ్చాయని, అంతకుమించి ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించారు. సుమారు 30 నిమిషాల పాటు నిలిచిపోయిన రైలును, సిబ్బంది బ్రేక్ షూ సమస్యను పరిష్కరించిన తర్వాత తిరిగి ఖజురహోకు పంపించారు. ప్రస్తుతం ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, రైలు తన ప్రయాణాన్ని యధావిధిగా కొనసాగిస్తోందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.






