- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనిషిపై దాడి.. ఆపై మంచంపై తీరిగ్గా నిద్ర పోయిన పులి
పులి ఓ మనిషిపై దాడి చేసి అనంతరం అక్కడే ఉన్న మంచంపై తాపీగా నిద్ర పోయింది.

దిశ, వెబ్ డెస్క్ : పులి ఓ మనిషిపై దాడి చేసి అనంతరం అక్కడే ఉన్న మంచంపై తాపీగా నిద్ర పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలోని ఓ గ్రామంలో కలకలం రేపింది. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోకి వచ్చిన పులి ఓ ఇంటి బయట ఉన్న గోపాల్ కోల్ అనే వ్యక్తిపై దాడి చేసిన అనంతరం అక్కడే ఉన్న మంచంపై నిద్ర పోయింది. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని దాదాపు ఎనిమిది గంటల పాటు శ్రమించి పులిని పట్టుకుని తిరిగి అడవిలో వదిలేశారు.
పులి దాడిలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. టైగర్ రిజర్వ్‌కు దగ్గరగా ఉండటంతో తమ గ్రామంలోకి తరచూ పులులు వస్తున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
Read More..
రీల్స్ పిచ్చితో రైలు కింద పడుకున్న యువకుడు.. అరెస్ట్ చేసి షాకిచ్చిన పోలీసులు






