- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీల్స్ పిచ్చితో రైలు కింద పడుకున్న యువకుడు.. అరెస్ట్ చేసి షాకిచ్చిన పోలీసులు
సోషల్ మీడియా క్రేజ్ ఒక యువకుడిని ఊచలు లెక్కపెట్టేలా చేసింది. వ్యూస్ కోసం రైలు కింద పడుకొని వీడియో చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా క్రేజ్ ఒక యువకుడిని ఊచలు లెక్కపెట్టేలా చేసింది. వ్యూస్ కోసం రైలు కింద పడుకొని వీడియో చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కొత్వాలీ ప్రాంతానికి చెందిన అజయ్ రాజ్‌బర్ అనే యువకుడు, కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం విపరీతమైన సాహసానికి ఒడిగట్టాడు. వేగంగా వస్తున్న రైలు కింద పట్టాల మధ్య పడుకుని వీడియో చిత్రీకరించాడు. ప్రాణాలకు తెగించి చేసిన ఈ ప్రమాదకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్ళింది.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు, రైల్వే భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించినందుకు అజయ్ రాజ్‌బర్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి ప్రాణాపాయ చర్యలకు పాల్పడవద్దని, సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చట్ట విరుద్ధమైన పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు యువతను హెచ్చరించారు.
Read More..






