ఏంటీ అరాచకం.. ఒక్క కొబ్బరికాయ రూ.5 లక్షలా?.. ఎంత పండగైతే మాత్రం!

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-25 14:16:48  IST  )

మనుషులు ఎంత మోడ్రన్‌గా మారినా.. లైఫ్ ఎంత డిజిటలైజ్డ్ అయినా.. ఎన్ని ఏఐలు పుట్టుకొచ్చినా.. దేవుడిపై భక్తి, విశ్వాసంలో మాత్రం మార్పు లేదు. ఇదే ఇక్కడ మరోసారి ప్రూవ్ అయింది. కర్ణాటక రాష్ట్రం బాగల్ కోట్ జిల్లా చిక్కలఖి గ్రామంలో ప్రతి ఏటా జరిగే మలింగరాయన్ జాతర

ఏంటీ అరాచకం.. ఒక్క కొబ్బరికాయ రూ.5 లక్షలా?.. ఎంత పండగైతే మాత్రం!
X

దిశ, వెబ్ డెస్క్ : మనుషులు ఎంత మోడ్రన్‌గా మారినా.. లైఫ్ ఎంత డిజిటలైజ్డ్ అయినా.. ఎన్ని ఏఐలు పుట్టుకొచ్చినా.. దేవుడిపై భక్తి, విశ్వాసంలో మాత్రం మార్పు లేదు. ఇదే ఇక్కడ మరోసారి ప్రూవ్ అయింది. కర్ణాటక రాష్ట్రం బాగల్ కోట్ జిల్లా చిక్కలఖి గ్రామంలో ప్రతి ఏటా జరిగే మలింగరాయన్ జాతర ఈ విషయాన్ని రుజువు చేస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రతీ శ్రావణ మాసంలో మలింగరాయన్ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు స్థానికులు. దేవుడిని సింహాసనంపై కూర్చోబెట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఇక్కడ ఆయనకు సమర్పించిన కొబ్బరికాయకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ పాలకాయను పొందితే.. పట్టినదల్లా బంగారమవుతుందనే నమ్మకం. కాగా దీనికోసం వేలంలో భారీ పోటీ నెలకొంటుంది.

ఈ ఏడాది కూడా అలాంటి పోటీనే నెలకొంది. లక్షతో ప్రారంభమైన ఈ స్వామి వారి కొబ్బరికాయ వేలంపాట.. ఏకంగా రూ. 5,71,001కు చేరింది. తికోట గ్రామానికి చెందిన మహావీర్ హరకేకు సొంతమైంది. నిజానికి ఈ వేలంలో మహావీర్, ముదుకప్ప పాటిదర్, పదాశివ్ మగూర్ మధ్య పోటీ నెలకొంది. కానీ చివరకు మహావీర్‌కు దక్కింది. గతేడాది కూడా ఆయనే ఈ కొబ్బరికాయను రూ. 6, 50, 001కు సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మలింగరాయన్ స్వామి తమకు సంపద, శ్రేయస్సును అందిస్తాడని.. ఆయనవల్లే తాము సుఖసంతోషాలతో ఉన్నామని.. మళ్లీ కొబ్బరికాయను పొందడం ఆనందంగా ఉందని తెలిపాడు.

Read More..

ఆపరేషన్ సిందూర్ గణేశుడిని చూశారా?.. నెట్టింట వీడియో వైరల్


Next Story