- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఎన్ని ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి.. పాకిస్థాన్ ఉగ్రవాద రాజధాని ముజఫరాబాద్ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఇవే
Operation Sindoor: భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడింది.

దిశ, వెబ్ డెస్క్: Operation Sindoor: భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరిట మే 7వ తేదీ బుధవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాల పైన క్షిపణి దాడులను చేపట్టింది.కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ దాడులను భారత రక్షణ దళాలు చేపట్టాయి. ఈ దాడి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో భారత వైమానిక దళం దాడి చేసింది. పాకిస్థాన్ లోని బాలాకోట్ – పాక్ ఆక్రమిత కాశ్మీర్. ముజఫరాబాద్ – పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని, చకోతి – నియంత్రణ రేఖ (LoC) సమీపంలో, కోట్లీ – పాక్ ఆక్రమిత కాశ్మీర్, నీలమ్ లోయ – పాక్ ఆక్రమిత కాశ్మీర్, మాన్సెహ్రా – ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, పాకిస్తాన్, బహావల్‌పూర్ – పంజాబ్, పాకిస్తాన్ ప్రాంతాలపై భారత్ క్షిపణులతో లక్షిత దాడులను చేసింది. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ముజఫరాబాద్ పైన అందరి దృష్టి నెలకొని ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధానిగా పిలవబడే ముజఫరాబాద్ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు కూడా ఒక రాజధాని అని చెప్పవచ్చు.
భారత్ లో అనేక ఉగ్రదాడులకు కారణమైన లష్కరే తోయబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు కూడా ముజఫరా బాద్ కేంద్రంగా ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో చాలా సంవత్సరాలుగా భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. భారత నిఘా సంస్థల అంచనా ప్రకారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 100కు పైగా ఉగ్రవాద శిబిరాలు నడుస్తున్నాయి. ఇక్కడ భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణలో భాగంగా ఉగ్రవాద దాడులు ఎలా చేయాలో మిలీటెంట్లకు శిక్షణ ఇస్తుంది. వీటిలో ముఖ్యంగా 25 వరకు ఉగ్రవాద శిక్షణ శిబిరాలు యాక్టివ్ గా పని చేస్తుంటాయి.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ రాజధానిగా ఉన్న ముజఫరాబాద్ కేంద్రంగా లష్కరే తోయిబా (LeT), జైషే మహమ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ కార్యాలయాలు, ఉగ్రవాద శిబిరాలు పనిచేస్తుంటాయి. వ్యూహాత్మకంగా ముజఫరాబాద్ ఎల్ఓసీ రేఖకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో భారత్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లకు ప్రోత్సహించేలా ఈ సంస్థలు పనిచేస్తాయి.
ముజఫరాబాద్ పేరుకి ఆజాద్ కాశ్మీర్ రాజధాని అయినప్పటికీ, అది పూర్తిగా పాకిస్తాన్ మిలటరీ కనుసన్నల్లో ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి బలవంతంగా తీసుకొని వచ్చి (ఇన్‌ఫోర్స్‌డ్ రిక్రూట్మెంట్) ఉగ్రవాద శిబిరాల్లో చేర్చి ప్రమాదకరమైనటువంటి శిక్షణ అందిస్తుంటారు. గతంలో అంతర్జాతీయ ఏజెన్సీలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ముజఫరాబాద్ లో పాకిస్థాన్ గూడచారి సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లోనే అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయి. ముఖ్యంగా ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, టార్గెట్ ప్లానింగ్ వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ఇక్కడ సాగుతుంటాయి. ముజఫరాబాద్‌లో ఎవరైనా పాక్ ప్రభుత్వాన్ని కానీ ఆర్మీని కానీ విమర్శిస్తే వారు వెంటనే అదృశ్యమై పోతారు. గతంలో పలువురు మానవ హక్కుల కార్యకర్తలతో పాటు పలువురు జర్నలిస్టులు ఇలా హత్యలకు సైతం గురయ్యారు.
Operation Sindoor : యుద్ధంలోకి దిగిన భారత్.. POK పై వైమానిక దాడులు






