- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : యుద్ధంలోకి దిగిన భారత్.. POK పై వైమానిక దాడులు
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్-పాక్ (Bharat-Pak)మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే.

దిశ,వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్-పాక్ (Bharat-Pak)మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఉగ్రదాడి అనంతరం జరిగిన పరిణామాలతో ఇరు దేశాల్లోనూ యుద్ధం తప్పదు అనే సూచనలు బలంగా వెళ్ళాయి. భారత్ ఏ క్షణాన అయినా ఎటాక్ చేయవచ్చునని పాక్ సరిహద్దులో భారీగా సైన్యాన్ని మోహరించింది పాక్.కాగా భారత్ లోనూ వైమానిక దాడులు జరుగుతాయని అనుమానిస్తూ.. నేడు సాయంత్రం అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అదే విధంగా రాజస్తాన్-పాక్ సరిహద్దుల్లోనూ వైమానిక మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. దీంతో దేశ ప్రజలంతా రేపో మాపో వార్ మొదలవనుంది అనుకుంటుండగానే.. భారత ఆర్మీ(Indian Army) యుద్ధ రంగంలోకి అడుగు పెట్టింది.
మంగళవారం రాత్రి బాగా పొద్దు పోయాక POK లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు(POK Attack) నిర్వహించింది. "ఆపరేషన్ సింధూర్"(Operation Sindhur) పేరిట ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేపట్టింది. జైషే మహ్మద్, లష్కర్ ఎ తోయిబాకు చెందిన దాదాపు 10 శిబిరాలపై మిస్సైల్స్ తో విరుచుకు పడింది. పహల్గాం దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్టు పేర్కొన్న ఇండియన్ ఆర్మీ.. ఆపరేషన్ సింధూర్ పేరుతో జస్టిస్ ఈజ్ సర్వ్డ్ అని ట్వీట్ చేసింది. అయితే తమ లక్ష్యం ఉగ్రవాద స్థావరాలు గాని పాక్ సైనిక స్థావరాలు కాదని ఓ ప్రకటన జారీ చేసింది. మరోవైపు POK లోని కోట్లి, ముజఫరాబాద్, బాహావల్ పూర్ లో భారత ఆర్మీ దాడులు చేసిందని పాక్ ఆర్మీ ధృవీకరించింది. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోగా, 12 మంది గాయపడినట్టు తెలిపింది. ముజఫరాబాద్ లో పవర్ గ్రిడ్ ను పేల్చేయగా.. కరెంటు పోయి, చిమ్మ చీకట్లు అలుముకోవడంతో ముజఫరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురైనట్టు పేర్కొంది.






