స్వీడన్‌తో PM మోడీ చేసుకున్న కీలక ఒప్పందాలు ఇవే !

by velandi.Saikiran |   (  Updated:2026-05-18 04:39:32  IST  )

స్వీడన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, ఆ దేశంతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు.

స్వీడన్‌తో PM మోడీ చేసుకున్న కీలక ఒప్పందాలు ఇవే !
X

దిశ‌, వెబ్ డెస్క్: స్వీడన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, ఆ దేశంతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. స్వీడన్ పీఎం ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 3 గంట‌లు సమావేశమైయ్యారు. ఈ త‌రుణంలోనే పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించుకోవడం, కీలక రంగాల్లో సహకారానికి అంగీకరించారు. భద్రత, ట్రేడ్, టెక్నాలజీ, హెల్త్ తో పాటు ఆర్థిక భాగస్వామ్యం తదితర అంశాలపైన ఇరువురు చర్చించారు. 2026-30 ఇండియా-స్వీడన్ జాయింట్ యాక్షన్ ప్లాన్ కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అంతకు ముందు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.

అటు స్వీడన్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం కూడా దక్కింది. స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం 'రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, కమాండర్ గ్రాండ్ క్రాస్' ను మన ప్రధాని మోడీ అందుకున్నారు. ఆ దేశంలో పర్యటిస్తున్న సందర్భంగా స్వీడన్ యువరాణి విక్టోరియా ఆయనను ఈ అవార్డుతో సత్కరించారు. దీంతో ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీకి 31 అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వం, విశేష కృషికి గుర్తింపుగా స్వీడన్ తాజాగా పురస్కారాన్ని అందించింది.

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం

Next Story