ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం

by velandi.Saikiran |   (  Updated:2026-05-18 04:40:45  IST  )

స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారంతో ప్రధాని మోడీని సత్కారించారు.

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది. స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారంతో ఆయ‌న‌ను స‌త్క‌రించారు. 'రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, కమాండర్ గ్రాండ్ క్రాస్స‌తో మోడీని సత్కరించింది స్వీడన్ ప్రభుత్వం. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్ అందించే అత్యున్నత స్థాయి గుర్తింపు, గౌరవం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వ‌ర‌కు ప్రధాని మోడీ ద‌క్కించుకున్న‌ పురస్కారాల సంఖ్య 31కు చేరింది.

ఇక అంత‌కు ముందు, స్వీడన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ ఘన స్వాగతం పలికారు. ఇది ఇలా ఉండగా ప్రధాని నరేంద్ర మోడీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం అందించడంపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రధాని మోడీ చేసిన విశేష కృషి, దార్షనిక నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు వెల్లడించింది కేంద్ర సర్కార్. ఇది ఇండియాకు గర్వ కారణమని తెలిపింది.

స్వీడన్‌తో PM మోడీ చేసుకున్న కీలక ఒప్పందాలు ఇవే !

Next Story