ఇద్దరు TVK ఎమ్మెల్యేలు మిస్సింగ్ ?

by velandi.Saikiran |   (  Updated:2026-05-07 04:53:55  IST  )

ఇద్దరు టీవీకే ఎమ్మెల్యేలు మిస్సింగ్ అయిన‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

ఇద్దరు TVK  ఎమ్మెల్యేలు మిస్సింగ్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు గంట గంటకు మారిపోతున్నాయి. హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం TVK విజయ్ చాలా కష్టపడుతున్నారు. 108 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన TVK పార్టీకి అధికారం అంత ఈజీగా ద‌క్కెలా కనిపించడం లేదు. ఐదుగురు సభ్యులు ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ, విజయ్ కి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరం. ఆయనకు సపోర్ట్ ఇచ్చేందుకు చిన్న పార్టీలు ముందుకు రావడం లేదు. మరోవైపు మెజారిటీ నిరూపించుకోవడానికి విజయ్ కి గవర్నర్ ఇవాళ ఒక్క రోజే ఛాన్స్ ఇచ్చార‌ని స‌మాచారం.

గ‌డువు లోపు మెజారిటీ చూపించకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారని చర్చ జరుగుతోంది. ఈ క్ర‌మంలో విజ‌య్ కు మ‌రో షాక్ త‌గిలిన‌ట్లు స‌మాచారం అందుతోంది. ఇద్దరు టీవీకే ఎమ్మెల్యేలు మిస్సింగ్ అయిన‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అసలే మెజారిటీ ఎమ్మెల్యేలు లేక నానా తంటాలు పడుతుంటే..ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు మాయమవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇందులో ఎంత మేర‌కు వాస్త‌వం ఉందో తెలియాల్సి ఉంది. అటు డీఎంకే, అన్నాడీఎంకే రెండు క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి.

డీఎంకే మా బద్దశత్రువు..ఇదంతా అతని కుట్ర : AIADMK

TVK విజయ్ కి మ‌రో షాక్.. కాన్వాయ్ రద్దు?


Next Story