TVK విజయ్ కి మ‌రో షాక్.. కాన్వాయ్ రద్దు?

by velandi.Saikiran |   (  Updated:2026-05-07 04:48:59  IST  )

విజయ్ ఎస్కార్ట్ ను రద్దు చేసినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

TVK విజయ్ కి మ‌రో షాక్.. కాన్వాయ్ రద్దు?
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు గంట గంటకు మారిపోతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన TVK, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. సెంచరీకి పైగా సీట్లు దక్కినా కూడా, విజయ్ సీఎం కాకుండా అనేక కుట్రలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో విజయ్ కి మరో షాక్ తగిలింది. విజయ్ ఎస్కార్ట్ ను రద్దు చేసినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విత్ డ్రా ఇప్పటికే అమలులోకి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. తన ఫామ్ హౌస్ కు సాధారణ Y సెక్యూరిటీతోనే విజయ్ వెళ్లడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.

విజ‌య్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు !

తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా TVKతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకేతో దాదాపు 55 ఏళ్ల బంధానికి కాంగ్రెస్ కటీఫ్ చెప్పిందని అంటున్నారు. భవిష్యత్తులో జరిగే లోకల్ బాడీ, లోక్ స‌భ‌ ఎన్నికల్లో కూడా విజయ్ తో పొత్తు కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించారు. ఇలాంటి తరుణంలో డీఎంకే, అన్నా డీఎంకే కలిసి అధికారం చేపడతాయంటూ జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. దీంతో విజయ్ గంధరగోళ‌ పరిస్థితిలో ఉన్నారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.

డీఎంకే మా బద్దశత్రువు..ఇదంతా అతని కుట్ర : AIADMK

ఇద్దరు TVK ఎమ్మెల్యేలు మిస్సింగ్ ?

Next Story