ప్రజలు సరైన నిర్ణయమే తీసుకుంటారు.. బీజేపీ నేత అన్నామలై కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-23 08:59:19  IST  )

తమిళనాడు ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్న వేళ బీజేపీ నేత కె.అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు సరైన నిర్ణయమే తీసుకుంటారు.. బీజేపీ నేత అన్నామలై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamilnadu)లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఉధృతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా కోయంబత్తూరు (Coimbatore)లో తన ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ ముఖ్యనేత కె.అన్నామలై (K. Annamala) కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ సరళిని చూస్తుంటే ప్రజలు విజ్ఞతతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని తాను పూర్తి విశ్వాసంతో ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం సాగించిన ఐదేళ్ల పాలనను ప్రజలు ఖచ్చితంగా బేరీజు వేసుకుంటారని తెలిపారు. తమిళనాడు ప్రజలకు మేలు చేసే నాయకత్వాన్నే ఓటర్లు ఎన్నుకుంటారని అన్నామలై ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా తాను ప్రస్తుతం రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయబోనని, అయితే ప్రతి పౌరుడు బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఓటు వేయడాన్ని ఎవరూ విస్మరించవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళల సౌకర్యార్థం ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీరు, నీడ, కుర్చీలు వంటి తగిన ఏర్పాట్లు చేసిందని ఆయన గుర్తు చేశారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల భారీ క్యూలు.. తొలి రెండు గంటల్లో రికార్డు స్థాయి పోలింగ్!

Next Story